సాంకేతిక కారణాలతో విమానం ఆలస్యం కావడం వల్ల కొందరు ప్రయాణికులు విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఘటన దిల్లీలో జరిగింది. జనవరి 2న దిల్లీ నుంచి ముంబయికి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం... సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. అసహనానికి లోనైన కొందరు ప్రయాణికులు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. పైలట్లు బయటకి రావాలంటూ కాక్‌పిట్ గది తలుపులు బాదినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
పైలట్లు బయటకి రాకపోతే.. కాక్‌పిట్ తలుపు బద్దలు కొడతామని బెదిరించినట్లు తెలిపారు. ఈ ఘటనపై విమానంలో ఉన్న సిబ్బందిని నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. నివేదిక వచ్చిన తరవాత చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అటు.. పౌర విమానయాన డైరక్టర్ జనరల్ (డీజీసీఏ) కూడా స్పందించింది. సదరు ప్రయాణికులపై చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది.
ఇదీ చదవండి:'ఇద్దరు భార్యలూ ఒకేసారి గెలిస్తే.. ఆ కిక్కే వేరప్పా!'