దిల్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో భాజపా ఎంపీ పర్వేశ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిల్లీలోని షహీన్ భాగ్ నిరసనలపై తీవ్రంగా స్పందించారు. కశ్మీరీ పండితులపై జరిగిన అకృత్యాలను పోలిన ఘటనలే షహీన్భాగ్లోనూ చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. తమకు రక్షణగా నిలబడే పార్టీనే ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. కేజ్రీవాల్‌ను ఎన్నుకుంటే కశ్మీర్ వంటి చోట్ల జరిగిన అకృత్యాలు దిల్లీ ప్రజలపైనా పునరావృతం అవుతాయని హెచ్చరించారు పర్వేశ్.
-
#WATCH: BJP MP Parvesh Verma says, "...Lakhs of people gather there (Shaheen Bagh). People of Delhi will have to think & take a decision. They'll enter your houses, rape your sisters&daughters, kill them. There's time today, Modi ji & Amit Shah won't come to save you tomorrow..." pic.twitter.com/1G801z5ZbM
— ANI (@ANI) January 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: BJP MP Parvesh Verma says, "...Lakhs of people gather there (Shaheen Bagh). People of Delhi will have to think & take a decision. They'll enter your houses, rape your sisters&daughters, kill them. There's time today, Modi ji & Amit Shah won't come to save you tomorrow..." pic.twitter.com/1G801z5ZbM
— ANI (@ANI) January 28, 2020#WATCH: BJP MP Parvesh Verma says, "...Lakhs of people gather there (Shaheen Bagh). People of Delhi will have to think & take a decision. They'll enter your houses, rape your sisters&daughters, kill them. There's time today, Modi ji & Amit Shah won't come to save you tomorrow..." pic.twitter.com/1G801z5ZbM
— ANI (@ANI) January 28, 2020
"అరవింద్ కేజ్రీవాల్ షహీన్ భాగ్కు అండగా నిలుస్తానని చెబుతున్నారు. మనీశ్ సిసోడియా అదే చెప్పారు. దిల్లీలో రేగిన ఈ రకమైన అల్లర్లు ఇంతకుముందు కశ్మీర్లో కనిపించాయి. కశ్మీరీ పండితుల కుమార్తెలపై అత్యాచారాలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్, హైదారబాద్‌లోనూ అలానే జరిగింది. ప్రస్తుతం దిల్లీలోని షహీన్ భాగ్‌లో లక్షలమంది గుమిగూడారు. తర్వాత వారు దిల్లీ ప్రజల ఇళ్లలోకి చొరబడతారు. ఆడవాళ్లపై అకృత్యాలు చేస్తారు. దిల్లీ ప్రజలు ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల అనంతరం మోదీ, షా మిమ్మల్ని కాపాడేందుకు రాలేరు. మీరు ఇప్పుడే జాగ్రత్తపడితే బాగుంటుంది. దేశానికి ప్రధానమంత్రిగా మోదీ ఉంటేనే ప్రజలు సురక్షితంగా ఉన్నామని భావిస్తారు."
-పర్వేశ్ వర్మ, భాజపా ఎంపీ
ఇదీ చూడండి: 54 అడుగుల జెండాతో 'పౌర చట్టం'పై నిరసన