ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న పోలింగ్ కేంద్రంగా రికార్డు సృష్టించింది హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ పోలింగ్ కేంద్రం. లాహౌల్-స్పితి జిల్లాలోని తాషిగంగ్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం సముద్ర మట్టానికి 15వేల256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కేంద్రంలో 49 మంది నేడు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రపంచంలో ఎత్తయినదిగా రాష్ట్రంలోని హిక్కిం పోలింగ్ కేంద్రం ఉండేదని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ స్థానాన్ని 2017 శాసనసభ ఎన్నికల్లో తాషిగంగ్ ఆక్రమించిందని రాష్ట్ర అసిస్టెంట్ ఎన్నికల అధికారి హర్బన్స్ లాల్ ధిమన్ చెప్పారు.
కేంద్రానికి 16 మంది ఓటర్లే
హిమాచల్‌లోని కిన్నౌర్ జిల్లాలోని కా పోలింగ్ కేంద్రంలో 16 ఓటర్లు మాత్రమే ఉన్నట్టు ధిమన్ తెలిపారు. తాషిగంగ్, కా పోలింగ్ కేంద్రాలు మండి లోక్‌సభ పరిధిలో ఉన్నాయి. ఈ స్థానంలో 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ భాజపా, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది.
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ నేడు జరగనుంది.
ఇదీ చూడండి : నేడు బదరీనాథ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ