ETV Bharat / bharat

ఆ ట్వీట్​కు ఒక గంటలోనే 52వేల లైక్​లు

ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో నిర్బంధంలోకి వెళ్లి మంగళవారం విడుదలైన జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా ట్విట్టర్​లో ట్రెండీగా మారారు. ఆయన చేసిన ఓ పోస్ట్​కు విశేష స్పందన లభించింది. ఒక గంట వ్యవధిలోనే వేల సంఖ్యలో లైక్స్​ వచ్చాయి.

Omar becomes toast of twitterati after release from detention, his tweet records nearly 52k likes
ఆ ట్వీట్​కు గంటలో 52వేల లైక్​లు
author img

By

Published : Mar 25, 2020, 8:43 AM IST

జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన ఓ ట్వీట్​కు విశేష స్పందన లభించింది. ఆయన పోస్ట్​కు ఒక గంట వ్యవధిలోనే 52వేల మంది లైక్ కొట్టారు. 8వేల మంది రీట్వీట్​ చేశారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నిర్బంధంలోకి వెళ్లిన అబ్దుల్లా మంగళవారమే విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫోటోతో ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు​.

Omar becomes toast of twitterati after release from detention, his tweet records nearly 52k likes
ఆ ట్వీట్​కు గంటలో 52వేల లైక్​లు

నిర్బంధంలో ఎలా ఉండాలో చెబుతా..

హరి నివాస్​ ప్యాలస్​ నుంచి బయటకు వచ్చిన తర్వాత గడ్డంతో ఉన్న తన చిత్రాన్ని ట్విట్టర్​లో పంచుకున్నారు అబ్దుల్లా. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో నిర్బంధ సమయంలో ఎలా ఉండాలో చిట్కాలు కావాలంటే చేబుతానని.. తనకు ఎనిమిది నెలల అనుభవం ఉందని పేర్కొన్నారు ఒమర్​.

కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్​లో అంతర్జాలం సేవలు పరిమితంగా ఉన్నప్పటికి లైక్​ల సంఖ్య పెరగడం గమనార్హం.

ఇదీ చూడండి: భారత్​ లాక్​డౌన్​: 21 రోజులు అందుబాటులో ఉండేవి ఇవే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.