తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం.. ఈ విద్యా సంవత్సరం నుంచి సంస్కృత భాషను ప్రవేశపెట్టింది. ఇంజినీరింగ్ విద్యలో భాగంగా 2019-20 విద్యాసంవత్సరానికి తత్వశాస్త్రం, భగవద్గీతను బోధించనుంది.
విద్యార్థులు తమ అభీష్టం మేరకు ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకునే సౌకర్యం ఉంటుందని ఉపకులపతి సూరప్ప తెలిపారు.
అయితే ఈ నిర్ణయంపై పలువురు రాజకీయ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సంస్కృత భాషను తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నమేనని డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శించారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేయండి'