ETV Bharat / bharat

'అసోం ఎన్​ఆర్​సీ సమాచారం సురక్షితమే' - NRC ASSAM

అసోంలో నిర్వహించిన ఎన్​ఆర్​సీ సమాచారం సురక్షితంగానే ఉందని కేంద్రం తెలిపింది. కొన్ని సాంకేతక సమస్యల కారణంగానే డేటా వెబ్​సైట్​లో కనిపించలేదని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హోంశాఖ పేర్కొంది.

NRC data safe: Home Ministry
అసోంలోని ఎన్​ఆర్​సీ సమాచారం సురక్షితమే
author img

By

Published : Feb 12, 2020, 12:05 PM IST

Updated : Mar 1, 2020, 1:59 AM IST

అసోంలో నిర్వహించిన జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ)కు సంబంధించిన సమాచారమంతా భద్రంగా ఉందని కేంద్రం ప్రకటించింది. ఇటీవల అధికారిక వెబ్​సైట్​ నుంచి ఎన్​ఆర్​సీ తుదిజాబితాను తొలగించారనే కథనాలు వెలువడ్డాయి... అయితే అలాంటిదేమీ లేదమి కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే క్లౌడ్‌లో సమాచారం కనిపించలేదన్న హోంశాఖ అధికార ప్రతినిధి.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.

డేటా కనిపించకపోవడం వాస్తవమే...

ఎన్​ఆర్​సీ అధికారిక వెబ్‌సైట్‌లో తుదిజాబితా కొద్దిరోజులుగా అందుబాటులో లేకపోవడంపై పేర్లు లేని వారు ఆందోళన చెందుతున్నారు. వెబ్‌సైట్‌ నుంచి జాబితా కనిపించకుండా పోయిన మాట వాస్తవమేనని.. అసోం ఎన్​ఆర్​సీ సమన్వయకర్త హితేశ్‌ దేవ్‌ శర్మ అంగీకరించారు. అయితే తుదిజాబితాలో మార్పులు చేస్తున్నారనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

"క్లౌడ్‌లో సమాచారాన్ని పొందుపరిచే కాంట్రాక్టును విప్రో సంస్థకు ఇవ్వగా.. ఆ గడువు గతేడాది అక్టోబర్‌ 19తో ముగిసింది. ఇప్పటివరకూ రెన్యువల్‌ చేయలేదు. అందువల్లే.. డిసెంబర్‌ 15 తర్వాత సమాచారం ఆన్‌లైన్‌లో కనిపించలేదు."

-హితేశ్‌ శర్మ, అసోం ఎన్​ఆర్​సీ కోఆర్డినేటర్​

త్వరలో విప్రోతో సమావేశమై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: నేడు ఆమ్​ఆద్మీ శాసనసభా పక్షనేత ఎన్నిక

Intro:Body:

Rural justice

Conclusion:
Last Updated : Mar 1, 2020, 1:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.