ETV Bharat / bharat

కాంగ్రెస్​లో నాయకత్వ సంక్షోభం లేదు: ఖుర్షీద్ - all-round support for Sonia and Rahul

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం లేదని సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. పార్టీ.. సోనియా, రాహుల్​ల వెంటే ఉందని చెప్పారు. నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు పార్టీలో సరైన వేదికలు ఉన్నాయని తెలిపారు. బహిరంగ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్​కు పూర్తిస్థాయి అధ్యక్షుడి ఎన్నికలో జాప్యం జరుగుతోందంటే అందుకు సరైన కారణం ఉంటుందని పేర్కొన్నారు.

No leadership crisis in Congress; support for Sonia, Rahul apparent: Salman Khurshid
కాంగ్రెస్​లో నాయకత్వం సంక్షోభం లేదు: ఖుర్షీద్
author img

By

Published : Nov 22, 2020, 4:01 PM IST

కాంగ్రెస్​లో నాయకత్వ సంక్షోభం లేదని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పష్టంచేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి పార్టీలో సంపూర్ణ మద్దతు ఉందని అన్నారు. అంధులు కాని ప్రతి ఒక్కరికీ ఈ విషయం అర్థమవుతుందని పీటీఐ ముఖాముఖిలో వ్యాఖ్యానింంచారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉపఎన్నికల ఫలితాలపై కపిల్ సిబల్, చిదంబరం సహా పార్టీలోని సీనియర్ నేతలు కాంగ్రెస్​ నాయకత్వాన్ని విమర్శిస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖుర్షీద్ స్పందించారు. వారి సూచనలకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే మీడియా ముందుకెళ్లి చెప్పడాన్ని తప్పుబట్టారు. అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కాంగ్రెస్​లో అవసరమైన వేదికలు ఉన్నాయని, బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అన్నారు.

"ఫలితాలపై చర్చ ఎప్పుడూ జరుగుతుంది. దానిపై ఎలాంటి సందేహం లేదు. తప్పు ఎక్కడ జరిగిందో నాయకత్వం గుర్తిస్తుంది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు నిర్ణయాలు తీసుకుంటుంది. అది సాధారణంగా జరిగేదే. దాని గురించి బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీ నాయకత్వం నా మాట వింటుంది. నాకు అవకాశం(అభిప్రాయాలు చెప్పేందుకు) వచ్చింది. వారికి(బహిరంగంగా విమర్శించేవారికి) కూడా అవకాశాలు లభిస్తాయి. అలాంటప్పుడు నాయకత్వం తమ మాట వినడం లేదనే ధోరణి ఎక్కడి నుంచి వస్తుంది."

-సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ సీనియర్ నేత

సంవత్సరం నుంచి సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉండటం పట్ల నేతలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను తోసిపుచ్చారు ఖుర్షీద్. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించేందుకు అధిక సమయం పడుతోందంటే అందుకు సరైన కారణం ఉంటుందని అన్నారు.

"తాత్కాలిక పదవి అయినప్పటికీ.. పార్టీకి సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, అసమంజసం కాదు. పార్టీ మనుగడ సాధించకుండా ఉండేందుకు అది అడ్డు కాదు. ఈ విషయంలో మేం సంతృప్తితోనే ఉన్నాం. పార్టీలో నాయకత్వ లోపం మాత్రం లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. కాంగ్రెస్ పార్టీ మొత్తం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెన్నంటే ఉందని అంధులు కాని వారెవరికైనా తెలుస్తుంది. వీరిద్దరికీ ప్రజల మద్దతు ఉంది."

పార్టీ ఉదారవాద విధానాల పట్ల ఓటర్లలో వ్యతిరేకత కనిపిస్తే.. సుదీర్ఘ లక్ష్యాలతో పనిచేయాలని సూచించారు ఖుర్షీద్. అంతేగానీ భావజాలాలను వదిలివేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు.

ఇదీ చదవండి- హద్దు మీరిన పాక్- బుద్ధి చెప్పిన భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.