ETV Bharat / bharat

నిర్భయ నిధి: డబ్బులిచ్చినా ఖర్చు చేయని రాష్ట్రాలు - nirbhaya fund utilization

నిర్భయ ఫండ్... దిల్లీ అత్యాచార ఘటన తర్వాత మహిళా భద్రత కోసం కేంద్రం తెచ్చిన నిధి. కేటాయింపులు ఘనంగా ఉన్నాయి. మరి రాష్ట్రాలు ఏమేరకు ఖర్చు చేస్తున్నాయి? నిర్భయ నిధి తెచ్చిన లక్ష్యం నెరవేరిందా?

nirbhaya fund
నిర్భయ నిధి: డబ్బులిచ్చినా ఖర్చు చేయని రాష్ట్రాలు
author img

By

Published : Mar 20, 2020, 12:59 PM IST

నిర్భయ అత్యాచారం... యావద్దేశాన్ని కదిలించిన ఘటన. మహిళా భద్రతపై విస్తృత చర్చ జరిగేందుకు కారణమైన ఉదంతం. ఆనాటి పౌరాగ్రహం, చర్చలు, సమాలోచనల నుంచి వచ్చిందే "నిర్భయ నిధి". మహిళా రక్షణ కోసం 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది.

నిర్భయ నిధికి నాటి యూపీఏ, నేటి ఎన్​డీఏ ప్రభుత్వాలు పెద్ద స్థాయిలోనే కేటాయింపులు చేశాయి. కానీ రాష్ట్రాలు ఆ నిధులను ఖర్చు చెయ్యడంలో విఫలమయ్యాయి. నిర్భయ నిధిలో 25 శాతం మాత్రమే ఉపయోగించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

  • నిర్భయ నిధిని ఎక్కువగా ఉపయోగించుకున్న రాష్ట్రాల్లో 50 శాతం వినియోగంతో ఉత్తరాఖండ్ ప్రథమస్థానంలో ఉంది. నిర్భయ ఘటన జరిగిన దిల్లీలో ఈ నిధుల వినియోగం తొమ్మిది శాతమే.
  • నిర్భయ ఫండ్ కింద వివిధ రకాల ఇబ్బందులకు గురవుతున్న మహిళలకు సహాయం అందించేందుకు వన్ స్టాప్ సెంటర్లు(ఓఎస్​సీ) ఏర్పాటు చేసింది కేంద్రం. 2016 నుంచి 19 వరకు కేంద్రం రూ. 219 కోట్లు ఈ ఓఎస్​సీలకు కేటాయించింది. అయితే ఇందులో రూ. 53. 98 కోట్లు మాత్రమే వినియోగమయ్యాయి. కేటాయించిన మొత్తంలో ఇది 24 శాతం.
  • విమెన్ హెల్ప్​లైన్ స్కీం కింద 2016-19 మధ్య రూ. 20.24 కోట్లు కేటాయించింది కేంద్రం. ఈ మొత్తంలో 13.34 శాతం నిధులే ఖర్చయ్యాయి. ఇది కేటాయించిన మొత్తంలో 65 శాతం.
  • స్వచ్ఛంద మహిళా పోలీసులకు 2016-19మధ్య రూ. 15.15 కోట్లు కేంద్రం కేటాయించగా ఈ మొత్తంలో రూ. 34.7 లక్షలు మాత్రమే వినియోగమయ్యాయి. కేటాయింపు మొత్తంలో ఇది 2.24 శాతం.
  • నిర్భయ నిధి కింద కేంద్రం రాష్ట్రాలకు రూ. 1649 కోట్లు కేటాయించగా రూ. 147 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయని వెల్లడించింది.
రాష్ట్రం కేటాయింపులు(కోట్లలో) వినియోగం(కోట్లలో ) శాతం
కర్ణాటకరూ. 191 రూ. 13.62 7%
దిల్లీ రూ. 390 రూ. 19.415%
తెలంగాణరూ. 130 రూ. 4 కోట్లు3.5%
బంగాల్రూ. 75. 70 రూ. 4కోట్లు5%

ఇదీ చూడండి: నిర్భయకు న్యాయం- మానవ మృగాళ్లకు ఉరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.