ETV Bharat / bharat

ఉరి వాయిదా కోసం నిర్భయ దోషి విడాకుల 'కుట్ర'! - నిర్భయ దోషుల విడాకులు

నిర్భయ దోషులు తమ ఉరి శిక్షను వాయిదా వేసేందుకు రోజుకో దారి వెతుక్కుంటున్నారు. ఇప్పటికే రెండో సారి క్షమాభిక్ష పిటిషన్​లు, క్యూరేటివ్ పిటిషన్​లు దాఖలు చేయగా... ఉరి వాయిదా కోసం తాజాగా మరో అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. తన భర్తతో విడాకులిప్పించాలని దోషి అక్షయ్ ఠాకూర్ భార్య పునీతా దేవీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం ఈ అనుమానాలకు తావిస్తోంది.

nirbhaya
నిర్భయ దోషి
author img

By

Published : Mar 18, 2020, 4:17 PM IST

నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్​ భార్య పునీతా దేవీ తన భర్తతో విడాకులు ఇప్పించాలని కోర్టుకెక్కింది. హత్యాచారం చేసిన వ్యక్తికి వితంతువుగా జీవించలేనంటూ సెంట్రల్ బిహార్ జిల్లా కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.

భర్త లైంగిక నేరాలకు పాల్పడినప్పుడు సదరు భార్యకు విడాకులు తీసుకునే హక్కు ఉంటుందని పునీతా తరపు న్యాయవాది ముకేశ్​ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

ఇప్పటివరకు తన భర్త అమాయకుడంటూ చెబుతూ వచ్చింది పునీతా దేవీ. అనవసరంగా తన భర్తను ఈ కేసులో ఇరికించారంటూ వాదించింది. ఈ నేపథ్యంలో విడాకుల వ్యవహారం కేవలం ఉరి శిక్షను వాయిదా వేసేందుకు ఓ కుట్ర అని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే మూడు సార్లు నిర్భయ దోషుల ఉరి శిక్ష వాయిదా పడింది. శిక్షను సవాల్​ చేసేందుకు న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకోవడం వల్ల దోషులకు అన్ని మార్గాలు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో మార్చి 20న ఉరి అమలుకు ఆదేశిస్తూ డెత్​​ వారెంట్​ జారీ చేసింది దిల్లీ కోర్టు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.