ETV Bharat / bharat

భీమా-కోరెగావ్ కేసులో మరో 8 మందిపై ఛార్జిషీటు​

భీమా-కోరెగావ్​ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ మరో 8 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్​లఖా, దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబు, గిరిజన నాయకుడు స్టాన్​ స్వామిని ఇందులో ప్రధానంగా పేర్కొంది.

NIA files charge-sheet against eight people in Bhima Koregaon case
భీమా-కోరెగావ్ కేసులో మరో 8 మందిపై ఛార్జిషీటు​
author img

By

Published : Oct 9, 2020, 5:42 PM IST

మహారాష్ట్ర భీమా-కోరెగావ్​ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) మరో 8 మందిపై అభియోగపత్రం దాఖలు చేసింది. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపింది. ​

కోరెగావ్​ యుద్ధంలో విజయం సాధించి 200 ఏళ్లు గడిచిన సందర్భంగా 2018 జనవరి 1న పుణె సమీపంలోని భీమా-కోరెగావ్​లో జరిగిన కార్యక్రమంలో హింస చెలరేగేలా అక్కడి ప్రజల్ని ఈ 8 మంది రెచ్చగొట్టారని అభియోగ పత్రంలో పేర్కొంది ఎన్​ఐఏ.

8 మంది ఎవరు?

  • గౌతమ్​ నవ్​లఖా, సామాజిక కార్యకర్త
  • హనీ బాబు, దిల్లీ విశ్వవిద్యాలయం అసోసియేట్​ ప్రొఫెసర్
  • ఫాదర్ స్టాన్ స్వామి, గిరిజన నాయకుడు
  • ఆనంద్ తేల్​తుంబ్డే, గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్​మెంట్ ప్రొఫెసర్
  • జ్యోతి జగ్​తాప్
  • సాగర్​ గోర్కే
  • రమేష్ గాయ్​కొర్

ఛార్జిషీటులో జాతీయ దర్యాప్తు సంస్థ మిలింద్​ తేల్​తుంబ్డే పేరును కూడా ప్రస్తావించింది. ప్రస్తుతం మిలింద్ పరారీలో ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి 'రుద్రం' ప్రయోగం సక్సెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.