ETV Bharat / bharat

ఆగని నేపాల్ ఆగడాలు- సీతాగుహ వద్ద విధ్వంసం

భారత్​- నేపాల్ మధ్యలోని నో మ్యాన్ లాండ్​లో ఉన్న సీతా గుహలోని ఓ స్తంభాన్ని కొంత మంది నేపాలీ పౌరులు కూల్చివేశారు. దీనిపై ఎస్​ఎస్​బీ దళాలు దర్యాప్తు చేస్తున్నాయి.

Nepali citizens allegedly uproot pillar near Sita Cave in Bihar
ఆగని నేపాల్ ఆగడాలు.. సీతాగుహలోని స్తంభం కూల్చివేత
author img

By

Published : Jul 19, 2020, 12:22 PM IST

ఇటీవల కాలంలో భారత్​కు వ్యతిరేక పోకడలను ప్రదర్శిస్తున్న నేపాల్ ఆగడాలు మరింత పెచ్చుమీరాయి. తాజాగా కొంత మంది నేపాల్​ పౌరులు.... బిహార్​లో సీతా గుహలోని ఓ స్తంభాన్ని కూల్చివేశారు. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎస్​ఎస్​బీ-4 దళాలు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి.

"ఓ నేపాల్ మంత్రి, థోరి పార్సా జిల్లాకు చెందిన ఎస్​డీఓ సీతా గుహను సందర్శించారు. ఆ తరువాత నేపాలీ పోలీసుల సమక్షంలో ఆ దేశ పౌరులు 436వ స్తంభాన్ని నేలకూల్చారు."

- జనరల్ శైలేష్ కుమార్ సింగ్, ఎస్​ఎస్​బీ అసిస్టెంట్ జనరల్

రాముడు మావాడే!

నేపాల్ ప్రధాని జులై 13న ఓ వింత వాదన చేశారు. నిజమైన అయోధ్య భారత్​లో లేదని, నేపాల్​లో ఉందని అన్నారు. శ్రీరాముడు దక్షిణ నేపాల్​ తోరిలో జన్మించాడని పేర్కొన్నారు. అలాగే భారత్​-నేపాల్ మధ్యలోని 'నో మ్యాన్ ల్యాండ్'​లో ఉన్న శ్రీరామునికి చెందిన చారిత్రక ప్రాంతాలు తమవేనని వాదించారు.

ఈ నేపథ్యంలోనే కొంత మంది నేపాలీలు గత రెండు రోజులుగా... పశ్చిమ చంపారన్​ బిఖానాథోరిలోని సీతా గుహకు తరచుగా వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా 436 నంబరు స్తంభాన్ని కూల్చివేశారు.

సీతాదేవి వాల్మీకి ఆశ్రమానికి వెళ్లే ముందు ఈ గుహలోనే కొంత కాలం గడిపిందని భారత్​, నేపాల్​ ప్రజలు నమ్ముతారు. అందుకే అక్కడ పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఎమర్జెన్సీ సర్వీస్​

భారత్​ - నేపాల్ సరిహద్దులను కలిపే... ఉత్తరాఖండ్​లోని ధార్చులా పట్టణంలోని ​ఓ వంతెనను శనివారం ఓ 30 నిమిషాల పాటు తెరిచారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ వంతెనను మూసేశారు. అయితే ఇరుదేశాల పౌరులను పరస్పరం తమ స్వదేశాలకు చేర్చేందుకు గాను ఈ వంతెనను తాత్కాలికంగా తెరచినట్లు అధికారులు తెలిపారు.

భారత సైన్యంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ నేపాలీ పౌరుడి కోసం భారత్ ఈ వంతెనను తెరచింది. ఇతనితో కలిపి రెండు దేశాల నుంచి మరో 27 సరిహద్దు దాటారు. వీరిలో భారత్​లో చదువుకుంటున్న కొంత మంది నేపాలీ విద్యార్థులూ ఉన్నారు.

ఇదీ చూడండి: కరోనా సామూహిక పరీక్షలకు అత్యవసర అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.