మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సలైట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. ధనోరాలో రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్న నాలుగు ట్రక్కులకు నిప్పు పెట్టారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
మహిళా నక్సలైట్ సృజనక్క ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఇవాళ గడ్చిరోలి జిల్లా బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. మే 1న ఆమె ఎదురుకాల్పుల్లో మృతి చెందింది. గడ్చిరోలి పరిధిలో సృజనక్కపై 155 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. అందులో 34 హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమె మృతికి ప్రతీకారంతో రగలిపోతున్న నక్సల్స్.... ఆదివారం ఇద్దరు పోలీసులను కాల్చిచంపారు. తాజాగా...రోడ్డు నిర్మాణంలో ఉన్న నాలుగు ట్రక్కులకు నిప్పుపెట్టారు
ఇదీ చదవండి: అంపన్ పంజా: తీర ప్రాంతాల్లో అల్లకల్లోలం