భారత్- రష్యా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కరోనా అనంతరం ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్లను.. సంయుక్తంగా అధిగమించేందుకు ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు అవసరమని మోదీ, పుతిన్‌లు అభిప్రాయపడ్డారు.
భారత్‌లో ఈ ఏడాది చివర్లో జరగబోయే వార్షిక ద్వైపాక్షిక సదస్సుకు పుతిన్‌ను ఆహ్వానించారు మోదీ. ఈ ఆహ్వానాన్ని స్వాగతించిన పుతిన్.. భారత ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రంగాల్లో ఇరు దేశాల మధ్యగల ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు పుతిన్.
కొవిడ్ సంక్షోభంలో ఉత్పన్నమైన సమస్యలను సంయుక్తంగా పరిష్కరించుకునేందుకు పరస్పర సహకారం అందించుకోవాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి.
అభినందించిన మోదీ..
రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా విజయానికి ప్రతీకగా జరిగే 75వ వార్షికోత్సవంతోపాటు ఆ దేశంలో రాజ్యాంగ సవరణకు విజయవంతంగా ఓటింగ్ పూర్తైన సందర్భంగా పుతిన్‌కు ఫోన్లో అభినందనలు తెలిపారు మోదీ.
ఇదీ చదవండి: టార్గెట్ చైనా: భారత అమ్ముల పొదిలోకి మరిన్ని అస్త్రాలు