ETV Bharat / bharat

ఎప్పుడొచ్చామని కాదు.. గెలిచి తీరతాను: టిక్​టాక్​ స్టార్

వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ ద్వారా ప్రాచుర్యం పొందే వ్యక్తులు సినిమాలకే కాదు.. రాజకీయాలకూ ఎంపికవుతున్నారు. ఎందుకంటే తాజాగా హరియాణా శాసనసభ ఎన్నికల్లో ఓ టిక్‌ టాక్‌స్టార్‌కు భాజపా ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

టిక్‌టాక్‌ స్టార్‌కు ఎమ్మెల్యే టికెట్..!
author img

By

Published : Oct 4, 2019, 8:58 AM IST

Updated : Oct 4, 2019, 3:51 PM IST

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ఎంత ప్రాచుర్యం పొందిందో నేటి తరానికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యువత తోపాటు, గృహిణులు, పెద్దలు అందరూ టిక్ టాక్ వీడియోలు తీస్తున్నారు. తాము పోస్ట్ చేసిన బెస్ట్ వీడియోలకు లైక్స్, కామెంట్స్ రావడం..ఫాలోవర్స్ పెరగడం వల్ల విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు.

ఇప్పుడు అదే క్రేజ్​ ఒక మహిళకు ఎమ్మెల్యే టిక్​ట్​ రావడానికి కారణమైంది. హరియాణా శాసనసభ ఎన్నికల్లో ఓ టిక్​టాక్​ స్టార్​కు భాజపా ఎమ్మెల్యే టికెట్​ కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
రెండోసారి విడుదల చేసిన జాబితాలో ఆదంపుర్‌ నియోజకవర్గ స్థానాన్ని ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫొగాట్‌కు కేటాయించింది.

ఎప్పుడొచ్చామని కాదు.. గెలిచి తీరతాను: టిక్​టాక్​ స్టార్

"భారతీయ జనతా పార్టీ నా మీద విశ్వాసం ఉంచి..ఆదంపుర్​​ నియోజకవర్గ టికెట్​ ఇచ్చింది. నాకు ఓ అవకాశం కల్పించింది. మేము (భాజపా నాయకులు) నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధికి.. హరియాణా వికాసానికి ఎంతో ప్రయత్నిస్తున్నాము. ఎప్పుడు వచ్చానని అసలు ఆలోచించడం లేదు.. ఇక్కడ విజయం సాధిస్తాను. కమలం వికసించి తీరుతుంది." - సోనాలీ ఫొగాట్​, భాజపా అభ్యర్థి

సోనాలీ ఫొగాట్‌కు టిక్‌టాక్‌లో లక్షకుపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. నిత్యం ఆమె తన వీడియోలను పోస్ట్‌చేస్తూ పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆమెకు చెందిన పలు వీడియోలు వైరల్‌గా కూడా మారాయి. ఆమెకు ఆన్‌లైన్‌ అభిమానులు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు బలం ఉన్న ఈ నియోజకవర్గంలో ఆమెకు గట్టి పోటీనే ఎదుర్కోవలసి ఉంటుందని సమాచారం.

mlas-ticket-to-ticktock-star-dot
టిక్‌టాక్‌ స్టార్‌కు ఎమ్మెల్యే టికెట్..!
mlas-ticket-to-ticktock-star-dot
టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫొగాట్
mlas-ticket-to-ticktock-star-dot
టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫొగాట్

ఈ స్థానం నుంచి 1969 నుంచి వరుసగా 8సార్లు మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ గెలిచారు. ఆ తర్వాత 1987, 1998ల్లో ఆయన భార్య జస్మాదేవి, కుమారుడు కులదీప్‌ బిష్ణోయ్‌ ఒక్కోసారి గెలిచారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో బిష్ణోయ్‌ కుటుంబ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ స్థానాన్ని సోనాలీ ఫొగాట్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది.

బిష్ణోయ్‌ దంపతులు 2014 ఎన్నికల్లో హరియాణా జనహిత కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచారు. అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయింది. హరియాణా శాసనసభకు అక్టోబర్‌ 21న ఎన్నికలు జరగనుండగా అక్టోబర్‌ 24న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:మారిషస్​లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ

Rewa (MP), Oct 04 (ANI): A poster of Mahatma Gandhi, at 'Bapu Bhavan' in MP's Rewa, was found defaced on Oct 02. An urn containing his ashes was also allegedly found missing. Police said, "Poster has been repainted, FIR registered. Investigation is on. We've not received a complaint regarding the urn."
Last Updated : Oct 4, 2019, 3:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.