ETV Bharat / bharat

మైనర్​పై ముగ్గురు భార్యలు ఉన్న వ్యక్తి అత్యాచారం - ఉత్తర్​ప్రదేశ్​లో బాలికపై అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మైనర్​ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని మేరఠ్ పోలీసులు అరెస్టు చేశారు. బాలికను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

kidnap and rape
అత్యాచారం
author img

By

Published : Sep 18, 2020, 5:11 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లో సెప్టెంబర్​ 3న అపహరణకు గురైన బాలికను పోలీసులు రక్షించారు. నిందితుడు అబ్దుల్లాను అరెస్టు చేశారు. బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు అబ్దుల్లా అంగీకరించినట్లు మేరఠ్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్​ తెలిపారు.

తమ కూతురు కనిపించటం లేదని బాలిక తల్లిదండ్రులు ఠాణాలో సెప్టెంబర్​ 3న ఫిర్యాదు చేశారు. బాలికను వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టుకుని బాలికను రక్షించినట్లు తెలిపారు.

42 ఏళ్ల అబ్దుల్లాకు ఇప్పటికే ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మైనర్​కు తనను తాను అమన్​ చౌదరిగా పరిచయం చేసుకున్నాడని వివరించారు. విగ్​ పెట్టుకుని యువకునిగా నటించి బాలికను నమ్మించాడని చెప్పారు.

ఇదీ చూడండి: కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి అరెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.