అసలేం జరిగిందంటే..
మహేంద్ర పార్కులోని సరై పైపల్ తలా ప్రాంతంలో సుశీల్(29) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి ఇంటిపక్కనే ఉన్న అబ్దుల్ సత్తార్.. తన ఇంట్లో ఎక్కువ శబ్దంతో పాటలు పెట్టాడు. సౌండ్ తగ్గించమని అడిగేందుకు సుశీల్‌తో పాటు, అతని సోదరులు సునీల్, అనిల్.. సత్తార్ ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఘర్షణ తలెత్తింది. వారిపై సత్తార్‌తో పాటు అతని నలుగురు కుమారులు కత్తితో దాడి చేశారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుశీల్ ప్రాణాలు కోల్పోయాడు. అతని సోదరులు సునీల్, అనిల్‌ను బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. అనిల్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ గొడవలో సత్తార్ భార్య షాజహాన్ కూడా గాయపడింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తార్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు షాహనవాజ్, ఆఫఖ్ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. సుశీల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఇదీ చూడండి:నవంబర్ నెలాఖరు వరకు అన్‌లాక్-5 నిబంధనలే