'అల్లుడు గారు గారెలు కావాలా.. బాబూ బూరెలు కావాలా..' అని అడిగితేనే మర్యాద చేసిట్టా ఏమిటి? హోలీ రోజున కొత్తల్లుడిని దర్జాగా గాడిదపై కూర్చోబెట్టి.. ఊరంతా ఊరేగించడమూ మర్యాదే అంటారు మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని విదా గ్రామస్థులు. అనడమే కాదు... 90 ఏళ్లుగా ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు.
విదా గ్రామంలో ఎప్పటిలానే ఈసారీ హోలీ ఉత్సవం ఘనంగా జరిగింది. మేలతాళాలతో కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగించారు గ్రామస్థులు. ఊరి మధ్యలో ప్రారంభమైన ఊరేగింపు గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద ముగిసింది. ఈ ఘట్టాన్ని సెల్‌ఫోన్ కెమెరాలతో బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు యువకులు.
"గ్రామానికి వచ్చిన కొత్త అల్లుడిని లక్ష్యంగా చేసుకుని ఈ ఉత్సవం సాగుతుంది. హోలీ సందర్భంగా 3, 4 రోజులు జరిగే ఈ తంతు పూర్తయ్యేవరకు అల్లుడు గ్రామం నుంచి పారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గాడిదపై ఊరేగింపును తప్పించుకునే ప్రయత్నం చేయకుండా కాపుకాస్తాం. ఈ సారి దత్తాత్రేయ గైక్వాడ్‌కు ఈ మర్యాదలు చేశాం."
- దత్త దేశ్‌ముఖ్, స్థానికుడు
ఇదీ చదవండి:తింటూ వీడియో గేమ్ ఆడితే మీ పని అంతే!