లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ)పై నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యల నిరోధక చట్టం-1967 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. భారత సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే హింసాత్మక చర్యలను ఎల్టీటీఈ కొనసాగిస్తుండటమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.
శ్రీలంక తమిళుల స్వాతంత్ర్యం కోసం ఎల్టీటీఈని 1976 సంవత్సరంలో పెద్దపులిగా పిలిచే వేలుపిళ్లై ప్రభాకరన్ స్థాపించారు. 2009 సంవత్సరంలో ఆ దేశ ప్రభుత్వం జరిపిన ప్రత్యేక ఆపరేషన్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: చివరి దఫా 'సిత్రం'- అన్న బాటలో సోదరి