ETV Bharat / bharat

పార్లమెంట్​లో రాహుల్ ప్రశ్నకు భాజపా స్ట్రాంగ్​ పంచ్​

author img

By

Published : Mar 16, 2020, 1:34 PM IST

దేశంలో బ్యాంకు మోసాలకు పాల్పడిన వారి జాబితాను బహిర్గతం చేయాలని పార్లమెంట్​లో డిమాండ్​ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వాళ్ల నుంచి రుణాలు రికవరీ చేయడానికి తీసుకున్న చర్యలేంటో చెప్పాలని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణాలు ఎగ్గొట్టిన వారంతా కాంగ్రెస్​ హయాంలోనే దేశాన్ని వీడారని రాహుల్​కు బదులిచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​.

rahul
పార్లమెంట్​లో రాహుల్ ప్రశ్నకు భాజపా స్ట్రాంగ్​ పంచ్​

బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన వారి జాబితాను బహిర్గతం చేయాలని పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. బ్యాంకు మోసాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

రాహుల్​ డిమాండ్​పై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్​ స్పందించారు. రుణాలు ఎగ్గొట్టినవారి పేర్లు, వివరాలు అధికారిక వెబ్​సైట్లో పొందుపరిచామని చెప్పారు. ఈ అంశంపై సరైన అవగాహన లేకుండానే కాంగ్రెస్​ సీనియర్ సభ్యులు మాట్లాడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ హయాంలోనే రుణఎగవేతదారులు దేశం వీడి వెళ్లారని విమర్శించారు ఠాకూర్​.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ఉండగా సహాయ మంత్రి ఎందుకు స్పందిస్తున్నారని రాహుల్​ సహా కాంగ్రెస్​ సభ్యులు నినాదాలు చేశారు.

పార్లెమెంట్​లో రాహుల్ ప్రశ్న

అనంతరం ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు రాహుల్. తన ప్రశ్నలు పూర్తి కాకుండా స్పీకర్​ అడ్డకున్నారని, పార్లమెంటు సభ్యుడిగా తన హక్కులను హరించారని ఆరోపించారు. దేశంలో బ్యాంకు మోసాలకు పాల్పడిన 500మంది జాబితాను తాను అడిగానని చెప్పారు. కేంద్రం నుంచి సరైనా సమాధానం రాలేదన్నారు. వారి వివరాలు చెప్పడానికి ప్రభుత్వానికి భయమెందుకని నిలదీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.