రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆకాశవాణి ద్వారా 'మనసులో మాట' బయటపెట్టారు నరేంద్ర మోదీ. నీటి సంరక్షణపై పలు సూచనలు చేశారు. ఎమర్జెన్సీకి 44 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆనాడు అత్యయిక స్థితిపై పోరాడిన వారిని గుర్తుచేశారు మోదీ. ఎమర్జెన్సీ లాంటి స్థితిని దాటి భారత్ ప్రస్తుతం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగైన భారత ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారత ఎన్నికల ప్రక్రియ ప్రపంచానికి ఆదర్శమని అభిప్రాయపడ్డారు. నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు.
4 నెలల పాటు మన్‌కీ బాత్కు దూరమవడం కాస్త బాధించిందన్నారు ప్రధాని.
- ఇదీ చూడండి: జులై 6న వారణాసికి ప్రధాని నరేంద్ర మోదీ