భారత్‌లో కరోనా విజృంభిస్తూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 69,921 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 819 మంది కొవిడ్‌తో పోరాడుతూ మృతి చెందారు. కరోనా రికవరీ రేటు 76.94 శాతానికి చేరింది. మరణాల రేటు 1.77 మేర తగ్గింది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 4.33 కోట్ల మందికి కరోనా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 7న కేసుల సంఖ్య 20 లక్షల మార్కు దాటింది ఆ తర్వాత ఆగస్టు 23న 30 లక్షలకు మార్కు దాటేసింది. అంటే కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే, మొత్తం నమోదైన కేసుల్లో 21.29 శాతమే యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి: ఇంట్లో నీళ్లు ఖతం చేస్తున్న కరోనా!