కర్ణాటకకు చెందిన శోషన్ బండారి.. చదువులో ఫెయిల్ అయినా జీవితంలో గెలిచాడు. ఆసక్తి ఉంటే తనదైన శైలిలో అద్భుతాలను సృష్టించవచ్చని నిరూపించాడు. 17 ఏళ్లకే సరికొత్త బైక్‌ను రూపొందించి విద్యార్థులకు ర్యాంకులు ముఖ్యం కాదు సృజనాత్మకత ముఖ్యం అని చాటాడు.
ఆలోచనే ఆయుధంగా..
శోషన్ బండారి తండ్రి ఒక సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు. చదువులో వెనుకబడిన శోషన్కు కటింగ్ చేయటం నేర్పించాడు. కానీ శోషన్కు ఆ పని ఇష్టం లేదు. తన తండ్రి షాపు పక్కనే ఉన్న బైక్ గ్యారేజ్‌లో మెకానిక్ పని నేర్చుకున్నాడు. అదే ఆసక్తితో బైక్ తయారు చేయటానికి గల సమాచారాన్ని, ముడి పదార్థాలను సేకరించాడు.
25 రోజుల్లోనే అద్భుతం
శోషన్ తయారు చేసిన బైక్.. సైకిల్ ఆకారంలో ఉంటుంది. ఒక్కరు ప్రయాణించే విధంగా రూపొందించాడు. కేవలం 25 రోజుల్లోనే 100సీసీ బైక్‌ను తయారు చేశాడు. ఈ బైక్‌లో 2.5 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్ ట్యాంక్‌ను అమర్చాడు. ఈ బైక్ 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ తయారు చేయటానికి శోషన్కు అయిన ఖర్చు కేవలం రూ. 9వేలు.
స్కూల్ టీచర్ రోమిలానే తనకు స్ఫూర్తి అని శోషన్ తెలిపాడు. ప్రస్తుతం రోషన్.. ఎలక్ట్రిక్, పెట్రోల్‌తో ఒకేసారి నడిచేలా బైక్‌ను రూపొందించటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు.
ఇదీ చదవండి : 'ఇంజినీర్' రైతు- వాటర్వీల్ ద్వారా సాగునీరు