ETV Bharat / bharat

కర్ణాటకలో ఈనెల 6న మంత్రివర్గ విస్తరణ... 13 మందికి అవకాశం

ఫిబ్రవరి 6న మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. మొత్తం 13 మందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరి ఉపఎన్నికల్లో గెలిచిన 10 మందికి మంత్రులుగా అవకాశమిస్తామని స్పష్టం చేశారు.

K'taka cabinet expansion on February 6, 13 MLAs will take oath: Yediyurappa
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ... 13 మందికి అవకాశం
author img

By

Published : Feb 3, 2020, 5:44 AM IST

Updated : Feb 28, 2020, 11:13 PM IST

కర్ణాటకలో ఈనెల 6న మంత్రివర్గ విస్తరణ

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఫిబ్రవరి 6న మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం 13 మందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో కాంగ్రెస్, జేడీఎస్​లను వదిలి భాజపా తరఫున గెలిచిన 10 మందికి మంత్రులుగా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అదనపు ఉపముఖ్యమంత్రులు అంటూ ఎవరూ ఉండరని స్పష్టం చేశారు.

"ఫిబ్రవరి 6న రాజ్​భవన్​లో ఉదయం 10.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు."- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

అధిష్ఠానం అనుమతితో..

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోని 17 మంది శాసనసభ్యులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, భాజపాకు మద్దతుగా నిలిచారు. ఫలితంగా వారిపై అనర్హత వేటు పడడం.. ఉపఎన్నికలకు దారితీయడం జరిగింది.

2019 డిసెంబర్​ 5న జరిగిన కర్ణాటక ఉపఎన్నికల్లో మొత్తం 15 స్థానాలకు గాను భాజపా 12 స్థానాల్లో విజయం సాధించింది. ఫలితంగా కర్ణాటకలో భాజపా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవకాశం ఏర్పడింది.

ఈ సందర్భంగా ఇతర పార్టీల నుంచి వచ్చి భాజపాలో చేరి తిరిగి ఎన్నికైన 11 మందిని మంత్రులుగా చేస్తామని యడియూరప్ప మాటిచ్చారు. ఈ నేపథ్యంలో తన మంత్రివర్గాన్ని విస్తరించేందుకు భాజపా అధిష్ఠానం నుంచి జనవరి 31న ఆమోదం పొందారు. మిగిలిన ఆరుగురు సభ్యులకు కూడా తాను ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తానని స్పష్టం చేశారు.

ఎలాగైనా అవకాశం కల్పిస్తాం!

అనర్హతకు గురై, ఉపఎన్నికల్లో భాజపా టికెట్​ లభించని రాణే బెన్నూర్​ మాజీ ఎమ్మెల్యే ఈ శంకర్​ను ముందు ఎమ్మెల్సీగా చేసి, తరువాత మంత్రిని చేస్తామని యడియూరప్ప స్పష్టం చేశారు.

భాజపాలో చేరి హునాసూరు, హోస్కోట్​ ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏహెచ్ విశ్వనాథ్​, ఎంటీబీ నాగరాజ్​లకు... సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మంత్రి పదవులు కేటాయించడం కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మాట నిలుపుకోండి... ప్లీజ్​!!!

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తమకు ఇచ్చిన మాటను యడియూరప్ప నిలుపుకోవాలని ఎమ్మెల్యేలు మహేశ్ కుమతహల్లి, విశ్వనాథ్​, నాగరాజ్​ కోరారు.
తనను క్యాబినెట్​ నుంచి తప్పించవచ్చేనే వార్తల నేపథ్యంలో అథాని ఎమ్మెల్యే మహేశ్ కుమతల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

"యడియూరప్పను పూర్తిగా విశ్వసించాను, నన్ను పదవి నుంచి తప్పిస్తారనే వార్తలు తీవ్రంగా బాధించాయి. సీఎం కేటాయించిన ఏ పని చేయడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నాను. కనీసం భాజపా కార్యాలయం తుడిచిపెట్టే పని ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను." - మహేశ్​, కర్ణాటక మంత్రి

కత్తిమీద సాము

కర్ణాటక మంత్రివర్గంలో మొత్తం 34 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 18 మంది మాత్రమే యడియూరప్ప క్యాబినెట్‌లో ఉన్నారు. మరో 16 మందికి అవకాశం ఉండగా...తాజాగా మంత్రివర్గం విస్తరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఆశావాహుల జాబితా ఎక్కువగా ఉండటం వల్ల యడియూరప్పకు మంత్రివర్గ విస్తరణ కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా కులాలు, ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం కర్ణాటక క్యాబినెట్​లో యడియూరప్పతో సహా 8 మంది లింగాయత్​లు, వక్కలిగలు-3, బ్రాహ్మణ-1, ఎస్సీ-3, ఓబీఎస్​-2, ఎస్టీ-1 ఉన్నారు.

కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడంపై యడ్డీ సర్కార్​పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆయనకు తగినంత బలం లేదని, ఆయన పరిపాలన కుప్పకూలిందని ఆరోపించాయి.

ఇదీ చూడండి: కరోనా: ప్రజలకు కేంద్రం నూతన మార్గదర్శకాలు

Intro:Body:

A Tamil Nadu hotel claims, 'Eat these onions to avoid coronavirus'

A hotel from Tamil Nadu has claimed that eating small onions can help prevent the deadly coronavirus infection. The hotel owner cited Tamil Nadu's traditional medical practice for this. The hotel owner has said that he has also started offering small onion food to customers in his hotel.

It is worth mentioning that till now in India, the symptoms of this deadly virus have been found in two people in Kerala. One of them was studying in Wuhan, China and the other person used to go to China for some reason. Let us tell you that this disease has taken the form of an epidemic in China, in which more than three hundred people have died so far and the World Health Organization (WHO) has given a worldwide emergency due to the danger of spreading the virus. Has been declared.

In view of the increasing threat of Coronavirus, there is an atmosphere of panic all over the world. Meanwhile, a hotel owner from Tamil Nadu has claimed that the most common way to avoid this dangerous virus is in our homes. A person running a hotel in Karaikudi, Tamil Nadu has claimed that if we use small onions in our food, then we can stop this dangerous virus.

Conclusion:
Last Updated : Feb 28, 2020, 11:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.