ETV Bharat / bharat

ముఫ్తీ విడుదల కోసం మరోమారు సుప్రీంకు ఇల్తిజా​

జమ్ముకశ్మీర్​ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ విడుదల కోసం సుప్రీం కోర్టులో తాజాగా హెబియస్ కార్పస్​ పిటిషన్​ దాఖలు చేశారు ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ. తన తల్లిని అన్యాయంగా నిర్బంధంలో ఉంచుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై అధికార యంత్రాంగం తీరును సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు.

author img

By

Published : Sep 23, 2020, 6:45 PM IST

Iltija moves SC
ఇల్తిజా ముఫ్తీ

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ (పీడీపీ) అధినేత్రి​ మెహబూబా ముఫ్తీ విడుదల కోరుతూ మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ. తాజాగా హెబియస్​ కార్పస్​ రిట్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవటాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ పిటిషన్​ దాఖలు చేసినట్లు చెప్పారు.

" నా తల్లి నిర్బంధం చట్ట విరుద్ధం. ఆమె బయటి ప్రపంచానికి చాలా రోజులుగా దూరంగా ఉన్నారు. ల్యాండ్​లైన్​ ఫోన్​ కనెక్షన్​ కూడా చట్టవిరుద్ధంగా, అకారణంగా తొలగించారు. ఏడాది కాలంగా ఎలాంటి విచారణ లేకుండా నిర్బంధంలో ఉంచారు. గతవారమే పిటిషన్​ దాఖలు చేశాం. ఫిబ్రవరిలో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, జమ్ముకశ్మీర్​ అధికార యంత్రాంగం ఇంకా సమాధానం ఇవ్వలేదనే విషయాన్ని తాజా రిట్​ పిటిషన్​ ద్వారా సుప్రీం కోర్టు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ఇది సుప్రీం కోర్టుపై వారికి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. నా తల్లి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలను కలవకుండా ఆమెను ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతున్నారు.

- ఇల్తిజా ముఫ్తీ

విడుదల చేస్తే ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు అనే పలు నిబంధనల బాండ్​పై సంతకం చేయలేదనే కారణంగానే తన తల్లిని నిర్బంధంలో ఉంచుతున్నారని ఆరోపించారు ఇల్తిజా.

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసింది కేంద్రం. దానికి ముందు రోజు మెహబూబా ముఫ్తీని నిర్బంధించారు. ఆరు నెలల తర్వాత పీఎస్​ఏ చట్టాన్ని అమలు చేసి.. నిర్బంధాన్ని కొనసాగించారు.

ఇదీ చూడండి: మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం పొడిగింపు

'మా అమ్మకు చపాతీలో లేఖ పెట్టి పంపించా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.