ETV Bharat / bharat

ఆధ్యాత్మిక కర్తార్​పుర్ నడవా రేపే ప్రారంభం

సిక్కుమతస్థులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా రేపే ప్రారంభం కానుంది. గురునానక్‌ 550 జయంతి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్‌ను దర్శించుకోనున్నారు. ఈ మేరకు భారత్ వైపున్న కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ జిల్లా డేరా బాబా నానక్‌ వద్ద నిర్మించిన ప్రయాణికుల టర్మినల్ భవనాన్ని మోదీ ఆరంభిస్తారు.

ఆధ్యాత్మిక కర్తార్​పుర్ నడవా రేపే ప్రారంభం
author img

By

Published : Nov 8, 2019, 6:46 PM IST

Updated : Nov 8, 2019, 10:19 PM IST

ఆధ్యాత్మిక కర్తార్​పుర్ నడవా రేపే ప్రారంభం

సిక్కు మత వ్యవస్థాపకులు గురునానక్.. తన చివరి 18 ఏళ్లను గడిపిన కర్తార్‌పుర్‌ను దర్శించుకోవాలన్న భారతీయ భక్తుల అడ్డంకులు రేపటితో తొలగిపోనున్నాయి. పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్రం.. నరోవాల్‌ జిల్లాలో ఉన్న దర్బార్‌ సాహిబ్‌ను.. భారత్​లోని పంజాబ్‌ రాష్ట్రంలోని గురుదాస్‌పుర్‌ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్‌ ఆలయాన్ని కలిపే కర్తార్‌పుర్‌ ఆధ్యాత్మిక నడవా రేపు ప్రారంభం కానుంది.

క్రీ.శ.1522 సంవత్సరంలో కర్తార్‌పుర్‌ వద్ద సాహిబ్‌ గురుద్వారాను నెలకొల్పారు గురునానక్‌ దేవ్‌. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకోవడానికి భారత్​లోని సిక్కు మతస్థులు దశాబ్దాలుగా ఎదురుచూశారు. చివరికి వారి నిరీక్షణ ఫలించి.. నడవా నిర్మాణానికి భారత్​-పాకిస్థాన్​లు అంగీకారం తెలిపాయి. అక్టోబర్‌ 24న కారిడార్ నిర్వహణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ నడవా.. భక్తులకు వీసా రహిత ప్రయాణాన్ని కల్పిస్తుంది. ఈ మేరకు భారత్‌ వైపు నడవాను ప్రధాని మోదీ... పాక్‌ వైపు కారిడార్‌ను పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రారంభించనున్నారు.

ముఖ్యనేతలతో మొదటి బృందం..

కర్తార్‌పుర్‌ ను దర్శించుకునేందుకు 550 మందితో కూడిన భారత ప్రతినిధి బృందం జాబితాను కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కు పంపింది. ఈ జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, కేంద్రమంత్రులు హర్‌దీప్‌ సింగ్‌ పురి, హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌తో పాటు కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా, దీపేందర్‌ సింగ్‌ హుడా, జితిన్‌ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

సన్నాహాలు పూర్తి...

కారిడార్‌ ప్రారంభోత్సవానికి ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ గురుదాస్‌పూర్‌, కపుర్తలా, అమృత్‌సర్‌ జిల్లాలకు సెలవు ప్రకటించారు. సందర్శకుల భద్రతకు పాక్‌ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 100 మందితో కూడిన పర్యటక పోలీసు దళాన్ని మోహరించింది. ఈ సంఖ్యను మరింత పెంచుతామని వెల్లడించింది పాక్‌ పోలీసు విభాగం. కర్తార్‌పుర్‌లో గురుద్వారా మినహా మరే ప్రాంతానికి వెళ్లకూడదని పాక్‌ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

సమస్యలు తలెత్తినా..

కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా నిర్మాణం నుంచే అనేక సమస్యలు తలెత్తాయి. అయితే, భారత్‌-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, కశ్మీర్ అంశం ఈ కారిడార్‌ నిర్మాణానికి అడ్డు రాలేదు. 1999లో ఇరుదేశాల మధ్య మొదటిసారి ప్రతిపాదనకు వచ్చిన ఈ ఆధ్యాత్మిక నడవా ఎన్నో చర్చల తర్వాత పట్టాలకెక్కింది. రోజుకు 5 వేల మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారని సమాచారం. అయితే కర్తార్‌పుర్‌ను దర్శించుకునే భక్తులకు పాక్​ కొన్ని షరతులు విధించింది.

పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు 20 డాలర్లు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు భారత్‌ తీవ్రంగా అభ్యంతరం తెలిపినా.. దాయాది దేశం వెనక్కి తగ్గలేదు. ప్రారంభ రోజు సహా గురునానక్ జయంతి అయిన నవంబర్‌ 12న రుసుమును వసూలు చేయబోమని మొదట ప్రకటించింది. అనంతరం ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గి ఆ రెండు రోజులు కూడా చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. పాస్‌పోర్టు కలిగి ఉండాలన్న అంశంపైనా పాక్ స్పష్టతనివ్వలేదు.

పాక్​కు ఆర్థిక చేయూత

యాత్రికుల నుంచి 20 డాలర్లు వసూలు చేయాలన్న నిర్ణయంతో కష్టాల్లో ఉన్న పాక్‌ ఖజానాకు నిధులు సమకూరనున్నాయి. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌... అధికారంలోకి రాకముందు గత ప్రధానులు దేశ పర్యటక రంగాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే దాయాది దేశం కారిడార్‌కు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అందుకే ద్వైపాక్షికంగా భారత్‌తో ఎన్ని సమస్యలున్నా కారిడార్‌ నిర్మాణానికి పాక్‌ కట్టుబడి ఉంది.

యాత్రికుల నుంచి వసూలు చేసే మొత్తంతో పాక్‌.. భారత కరెన్సీలో 258 కోట్ల రూపాయలు ఆర్జించనుంది. ఇది పాక్‌ కరెన్సీలో 571 కోట్ల రూపాయలకు సమానం. కర్తార్‌పూర్ కారిడార్‌ వల్ల... పాక్‌లో మత పరమైన పర్యటకానికి అవకాశాలు కూడా తెరుచుకుంటాయని ఇమ్రాన్ ఖాన్‌ వెల్లడించారు. కేవలం సిక్కులకే కాకుండా.. దేశంలో ఉన్న పలు ఇతర మతాల దర్శనీయ స్థలాలను సందర్శించుకునేందుకు ఆయా మతస్థులు ఆసక్తి చూపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అంతిమంగా పాక్‌ ఆర్థిక రంగానికి ఊతమిస్తాయని ఇమ్రాన్ తెలిపారు.

ఇదీ చూడండి: 'శివసేనతో సీఎం పదవిపై ఒప్పందం జరగలేదు'

RESTRICTION SUMMARY: NO ACCESS MAINLAND CHINA
SHOTLIST:
  
CCTV – NO ACCESS MAINLAND CHINA
Tibet – Recent, 2019
++GRAPHICS AND COMMENTARY FROM SOURCE++
1. Various of a stealth fighter taking off
2. Various of stealth fighters conducting remote attacks
3. Various of electronic countermeasures
4. Various of a soldier operating machines
5. Various of radar working
6. Various of soldiers preparing to fire missiles
7. Various of missiles firing into air
8. Missile reaching target
9. Various of soldiers firing missiles in drill
10. Soldiers handling equipment
11. Various of soldiers conducting missile firing drills
12. Soldier of special operations reconnaissance unit reporting through phone
13. Various of artillery attacking targets
14. Solder guiding driver
15. Soldiers constructing a bridge
16. Aerial shot of the newly-built bridge
17. Soldier speaking on the phone
18. Various of a tank going over bridge
19. Various of soldiers performing drills
20. Various of soldier handling equipment
21. Various of missiles and guns
STORYLINE
China's military has conducted a series of exercises in Tibet, including the use of two stealth fighter jets.
The exercises, 4,500 metres above sea level, were part of high-altitude training drills involving the army and the air force.
The stealth fighters used precision guidance to attack targets remotely, according to state broadcaster CCTV.
Surface-to-air missiles and anti-aircraft guns also featured in the exercises, CCTV said.
The broadcaster said troops built a 30-meter-long heavy mechanised bridge within 15 minutes.  
The exact date of the drills wasn't disclosed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 8, 2019, 10:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.