కన్నడ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ ఎదుట బైఠాయించిన ఆయనను బలవంతంగా లాకెళ్లి కస్టడీకి తరలించారు.
శివకుమార్‌ను కలిసేందుకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా, మహారాష్ట్ర మాజీ మంత్రి ససీం ఖాన్‌లనూ అదుపులోకి తీసుకుట్లు అధికారులు తెలిపారు. వీరిని కలినా విశ్వవిద్యాలయ విశ్రాంతి గృహానికి తరలించారు.
టీవి ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న శివకుమార్‌ను లాక్కెళ్లినంత పని చేశారు పోలీసులు.
అసమ్మతి ఎమ్మెల్యేలు ఉన్న హోటల్లోకి ప్రవేశించేందుకు బుధవారం ఉదయం యత్నించిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తన మిత్రులను కలవకుండా ముంబయిని వీడేది లేదని హోటల్ వద్ద బైఠాయించారు డీకే. అనంతరం ఈ పరిణామాలు జరిగాయి.
ఇదీ చూడండి: కర్ణాటకీయం లైవ్: స్పీడ్ పోస్ట్‌లో రాజీనామాలు!