వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టేను మక్కల్ నీది మయ్యమ్ (ఎమ్ఎన్ఎమ్) పార్టీ అధినేత కమల్ హాసన్ స్వాగతించారు. సుప్రీంకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయస్థానం తీర్పుపై కమల్ బుధవారం ఈ విధంగా స్పందించారు.
'కనీసం ప్రక్రియ అయితే ప్రారంభమయింది. ఇది కాదంటే, ఇంకో ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుకుదాం' అని కమల్ అన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీని ఉద్దేశించి కమల్ పేర్కొన్నారు.
ఎమ్ఎన్ఎమ్ ఎజెండా..
పారిశ్రామిక రంగం అభివృద్ధిపై ఎమ్ఎన్ఎమ్ పార్టీ ఎజెండాను ప్రకటించింది. వ్యాపారాలు సులభతరం అయ్యేందుకు కొత్త విధానం సహా మినిస్ట్రీ ఆఫ్ పాజిబిలిటీస్ను ప్రవేశ పెట్టడం ఇందులో కీలక ప్రతిపాదనలు. విజ్ఞానం, సాంకేతిక విభాగం కోసం మినిస్ట్రీ ఆఫ్ పాజిబిలిటీస్ను స్థాపిస్తామని పార్టీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : 'తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు'