ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో ఒడిశాకు చెందిన ఓ యువకుడు అత్మహత్య చేసుకున్నాడు. కటక్ జిల్లా మాట్రూ భవన్ పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది. అతి వేగంతో రైలు వస్తుండగా.. ఒక్కసారిగా పట్టాలపైకి దూకి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.
విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసున్నారు. మృతుడు నయాలి ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్‌గా గుర్తించారు. అత్మహత్యకు ముందు మనోజ్ తన సెల్ఫోన్లో ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది
ఓ అమ్మాయితో మనోజ్ కుమార్ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అనంతరం వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. ఈ క్రమంలో తను ప్రేమించిన అమ్మాయి మరొక యువకుడితో ప్రేమలో పడిందని, అతడితో పెళ్లికూడా నిశ్చయమైందని తెలిసి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మనోజ్ తన సెల్ఫీ వీడియోలో తెలిపాడు.