పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాజౌరీ జిల్లాలోని సుందర్బనీ సెక్టార్లో కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు పూంచ్ జిల్లా కిర్ని సెక్టార్లో గురువారం రాత్రి 10:45 గంటలకు పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. చిన్నపాటి ఆయుధాలు, మోర్టార్ షెల్లింగులతో నియంత్రణ రేఖ వెంబడి దాడి చేసినట్లు పేర్కొన్నారు.
అయితే.. పాక్ కాల్పులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్లు స్పష్టం చేశారు అధికారులు.
ఇదీ చదవండి: కశ్మీర్లో ఎన్కౌంటర్- ఓ ముష్కరుడు హతం