సుద్ద ముక్క, పెన్సిల్‌తో సాధారణంగా అందరికీ రాయడమే తెలుసు. అయితే ఓ వ్యక్తి మాత్రం వాటి ద్వారా తన కళా నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాడు. తన అద్భుత నైపుణ్యంతో సుద్దముక్కలు, పెన్సిల్ నిబ్లపై వినాయకుడి ప్రతిమలను చెక్కి ఔరా అనిపిస్తున్నాడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హరిసింగ్ క్షత్రి.
కోర్బా జిల్లా మ్యూజియంలో గైడ్‌గా పనిచేస్తున్న హరిసింగ్.. తన ఖాళీ సమయాన్ని ఇలా సూక్ష్మ కళాకృతులు తీర్చిదిద్దడానికి కేటాయిస్తానని తెలిపారు. ఈ కళకు సంబంధించి తన వద్ద ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేవని.. తన దగ్గరుండే చిన్న చిన్న వస్తువులతోనే వీటిని రూపొందిస్తున్నానని చెప్పుకొచ్చాడు హరిసింగ్.
'సూక్ష్మ కళ అంటే నాకు అమితాసక్తి. కళకు సంబంధించిన కనీస ఉపకరణాలు కూడా నా దగ్గర లేవు. స్క్రూడ్రైవర్లు, సూదులు, బ్లేడ్లు, గోళ్ల సాయంతోనే వీటిని చెక్కుతున్నాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది. పైగా తరచూ విరిగిపోతూ ఉంటాయి.'
- హరిసింగ్
ఇంకా ఎన్నో..
10 మిల్లీ మీటర్ల పొడవు ఉండే సుద్దముక్కలు, పెన్సిల్ నిబ్ పైనే కాకుండా.. కొబ్బరి, రాయి, నత్త, ఆల్చిప్ప, వెదురు, సబ్బు, కలప, పోక గింజలు, చెట్ల వేర్లు, బెరడు వంటి వాటిపై కూడా ఎన్నో నమూనాలను రూపొందించారు హరిసింగ్.
ఇదీ చదవండి: కరోనా సమయంలో కళాస్వాదన