ETV Bharat / bharat

దేశంలో వైరస్​కు 'కొత్త రూపం'- వైద్యుల ఆందోళన

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఉన్న హాట్​స్పాట్లలో ఒక్కటైన ఇండోర్​లో మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని అక్కడి వైద్యులు అంటున్నారు. ఇండోర్​లో వైరస్​ కొత్త రూపం దాల్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

indore-strain-may-be-deadlier-will-send-samples-to-niv-docs
వైరస్​కు కొత్త రూపం! వైద్యుల ఆందోళన
author img

By

Published : Apr 26, 2020, 12:31 PM IST

ప్రాణాంతక కరోనా వైరస్​ దేశంలో కొత్త రూపం దాల్చిందా? ఇదే విషయంపై మధ్యప్రదేశ్​లోని ఇండోర్​ వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇండోర్​లో విస్తరిస్తోన్న వైరస్​.. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే భిన్నంగా ఉందని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో వైరస్​ ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉందని అంటున్నారు.

పుణెలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ(ఎన్​ఐవీ)కి నమూనాలను పంపనున్నట్టు మహాత్మా గాంధీ మెమోరియల్​ వైద్య కళాశాల డీన్​ జ్యోతి బిందాల్​ వెల్లడించారు.

"ఇండోర్​లో ఉన్న వైరస్​ మరింత ప్రాణాంతకమని మేము భావిస్తున్నాం. ఎన్​ఐవీతో ఈ విషయంపై చర్చించాం. వారికి ఇక్కడి నమూనాలను పంపుతాం. వారి వద్ద ఉన్న వైరస్​ జీనోమ్​తో ఈ నమూనాలను పోల్చి చూస్తారు."

--- జ్యోతి బిందాల్​, మహాత్మా గాంధీ మెమోరియల్​ వైద్య కళాశాల డీన్​.

మరణాల రేటుపై ఆందోళన...

మధ్యప్రదేశ్​లోని హాట్​స్పాట్లలో ఇండోర్​ ఒకటి. వైరస్​ సోకి ఇప్పటివరకు 57మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఉన్న మరణాల సగటు కన్నా ఇది ఎక్కువ(4.8శాతం)గా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది.

రోగులు ఆసుపత్రుల్లో చేరడం ఆలస్యమవుతుండటం ఇందుకు ఓ కారణంగా పేర్కొన్నారు వైద్యులు. మరణాల రేటుపై దర్యాప్తు జరపాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు వైరల్​ కల్చర్​, ఆర్​ఎన్​ఏను ఉపయోగించాలన్నారు. అయితే వైరస్​ మృతుల్లో ఎక్కువ మందికి ఇతర అనారోగ్య సమస్యలూ ఉన్నట్టు తెలిపారు.

ఇండోర్​లో గత 24 గంటల్లో తాజాగా 91 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 1,176కు పెరిగింది. 107మంది వైరస్​ను జయించారు.

ఇదీ చూడండి:- 24 గంటల్లో 1,990 కొత్త కేసులు- 49 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.