ETV Bharat / bharat

కశ్మీరుపై చర్చకు మేము సిద్ధం: ఇమ్రాన్

పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కశ్మీర్​ సహా అన్ని సమస్యల పరిష్కారానికై చర్చించడానికి పాక్​ సిద్ధమని... ఇరుదేశాలు పేదరికంపై విజయం సాధించేందుకు ఇదే ఏకైక మార్గమని ఇమ్రాన్​ తన లేఖలో పేర్కొన్నారు.

author img

By

Published : Jun 8, 2019, 6:21 AM IST

మోదీకి పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ లేఖ!

ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​ లేఖ రాశారు. కశ్మీర్​ సహా ఇరుదేశాల మధ్య ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికై చర్చలు జరపేందుకు పాక్​ సిద్ధమని ఇమ్రాన్​ స్పష్టం చేసినట్లు సమాచారం. షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) సదస్సులో పాక్​ ప్రధానితో మోదీ సమావేశం ఉండదని అధికారులు తెలిపిన ఒక్క రోజులోనే ఇమ్రాన్​ ఈ లేఖ రాయడం గమనార్హం.

ఇరుదేశాలు పేదరికంపై విజయం సాధించేందుకు చర్చలే ఏకైక మార్గమని ఇమ్రాన్​ ఖాన్​ తన లేఖలో పేర్కొన్నారు. భారత ప్రధానిగా రెండోసారి ఎన్నికైన మోదీకి ఇమ్రాన్​ఖాన్ అభినందనలు తెలిపినట్లు సమాచారం.

ఈనెల 13,14 తేదీల్లో కిర్గిజిస్థాన్​ రాజధాని బిష్కెక్​లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) సదస్సులో ప్రధాని పాల్గొంటారు. ఈ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్​పంగ్​తో మోదీ విడిగా సమావేశమవుతారు. అయితే పాకిస్థాన్​ ప్రధానితో భేటీ లేదని ఇదివరకే అధికారులు స్పష్టం చేశారు.

పాక్​ విదేశాంగ మంత్రి లేఖ

విదేశాంగ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జైశంకర్​కు పాకిస్థాన్​ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి మహమూద్​ ఖురేషి శుక్రవారం లేఖ రాశారు. భారతదేశంతో అన్ని ప్రాధాన్య అంశాలను చర్చించడానికి పాకిస్థాన్​ సిద్ధంగా ఉన్నట్లు ఖురేషీ తెలిపారు. ఉపఖండంలో శాంతి స్థాపనకు పాక్ కట్టుబడి ఉందని లేఖలో పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయశంకర్​కు ఖురేషీ శుభాకాంక్షలు తెలిపారు.

పుల్వామా దాడితో దెబ్బతిన్న సంబంధాలు

జమ్ముకశ్మీర్ పుల్వామాలో పాక్​ ఆధారిత జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ ఫిబ్రవరిలో జరిపిన దాడిలో 40 మంది భారత సీఆర్ఫీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అనంతరం బాలాకోట్​లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానికదళం దాడి చేసింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఇదీ చూడండి : 2 గంటల పాటు కోర్టులో నిల్చొన్న సాధ్వీ

Bettiah (Bihar), June 07 (ANI): While speaking to ANI, BJP Leader Renu Devi said, "I have never encouraged wrong behavior. I have no relation with Pinu, with that house, from past many years. We are not in talking terms, still I am being dragged into a controversy. If anyone commits a mistake, he or she should be punished, even if it's me." Earlier, on June 03 in Bihar's Bettiah Renu Devi's brother Pinu assaulted a chemist at a medical shop allegedly for not standing up to show him respect.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.