కాంగ్రెస్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్ తదుపరి కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. తాను భాజపాలో చేరడం లేదని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి చాలా శ్రమించినట్లు తెలిపారు.
మరోవైపు పైలట్ వర్గాన్ని పార్టీ పదవులు, ప్రభుత్వం నుంచి తప్పించిన కాంగ్రెస్.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నివాసంలో.. నిన్న జరిగిన సమావేశంలో చర్చించారు. మంత్రిమండలి భేటీలోనూ తాజా పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది.పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
భాజపా భేటీ...
ఈ సంక్షోభం నేపథ్యంలో అప్రమత్తమైన భాజపా తాజా పరిస్థితులపై చర్చించేందుకు నేడు జయపురలో మరోసారి సమావేశం కానుంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది.