ETV Bharat / bharat

రూ.100 కోట్లు విలువ చేసే హెరాయిన్ పట్టివేత - 3 LeT terrorist

3 LeT terrorist associates held, Pak-sponsored narco-terror module busted: J&K police
ముగ్గురు నార్కో- టెర్రరిస్టుల అరెస్టు.. 1.3 కోట్లు పట్టివేత
author img

By

Published : Jun 11, 2020, 2:58 PM IST

Updated : Jun 11, 2020, 4:52 PM IST

15:31 June 11

ముగ్గురు నార్కో- టెర్రరిస్టుల అరెస్టు.. 1.3 కోట్లు పట్టివేత

3 LeT terrorist associates held, Pak-sponsored narco-terror module busted: J&K police
ముగ్గురు అరెస్టు

జమ్ముకశ్మీర్​ కుప్వారాలో పాకిస్థాన్ అనుబంధ నార్కో-టెర్రర్ మాడ్యూల్‌ను హంద్వారా పోలీసులు ఛేదించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ముగ్గురుని అరెస్టు చేశారు. వీరి నుంచి 21 కిలోల హెరాయిన్, 1.34 కోట్ల విలవ చేసే భారత కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో వీరిని పట్టుకున్నట్లు వెల్లడించారు.  

ఈ 21 కిలోల హెరాయిన్​ అంతర్జాతీయ మార్కెట్లో రూ.100 కోట్లు విలువ చేస్తుందని పేర్కొన్నారు.  వీటితో పాటు నగదు లెక్కించే మిషన్​ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

"హెరాయిన్​ వర్తకానికి చెందిన ఈ మ్యాడ్యూల్​తో పాకిస్థాన్​కు చెందిన ఉగ్రమూకలకు సంబంధం ఉంది. ఇది లష్కరే తోయిబాకు చెందిన ముష్కరులకు ఆర్థికంగా సహయం చేస్తుంది. మాదకద్రవ్యాలను పట్టుకోవటం వల్ల డ్రగ్​ డీలర్లకు, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు బహిర్గతమయ్యాయి." అని అధికారులు వెల్లడించారు.

హంద్వారా పోలీస్​ స్టేషన్లో వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై సిట్​ లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

14:56 June 11

జమ్ముకశ్మీర్​లో​ రూ.100కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత

జమ్ముకశ్మీర్ కుప్వారాలో రూ .100కోట్లు విలువ చేసే హెరాయిన్​ను పోలీసులు పట్టుకున్నారు. హెరాయిన్​ను తరలిస్తున్న ముగ్గురు నార్కో టెర్రరిస్టులను అరెస్ట్​ చేశారు. అలాగే వారి వద్ద రూ .1.34 కోట్ల భారత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Jun 11, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.