ETV Bharat / bharat

కర్ణాటకీయం: బుజ్జగింపుల్లో కూటమి- ధీమాగా భాజపా

కర్ణాటక రాజకీయం మలుపులు తిరుగుతూనే ఉంది. బలపరీక్షకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించడం, ఇప్పటికే సుప్రీం తలుపుతట్టిన 10 మంది అసంతృప్తులకు మరో ఐదుగురు తోడవడం..కన్నడ రాజకీయాన్ని మరింత వేడెక్కిచ్చాయి. బలపరీక్షలో నెగ్గితీరాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్‌-జేడీఎస్‌ అసంతృప్తుల బుజ్జగింపుల ప్రక్రియను వేగవంతం చేసింది.

కర్ణాటకీయం: బుజ్జగింపుల్లో కూటమి- ధీమాగా భాజపా
author img

By

Published : Jul 14, 2019, 4:58 AM IST

Updated : Jul 14, 2019, 5:34 AM IST

కర్ణాటకీయం: బుజ్జగింపుల్లో కూటమి- ధీమాగా భాజపా

కన్నడనాట రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. బలపరీక్షలో నెగ్గేందుకు కాంగ్రెస్- జేడీఎస్​ కూటమి విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు భాజపా సోమవారమే విశ్వాసపరీక్ష పెట్టేలా కుమారస్వామిపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకొంది.

కూటమి సఫలం..!

రెబల్​ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చేందుకు కూటమి నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజును దారికి తెచ్చుకోవడమే కాక ఆయన ద్వారా మరో శాసనసభ్యుడు సుధాకర్​ని కూడా రాజీనామా వెనక్కి తీసుకునేందుకు ఒప్పించేలా చేశారు.

శనివారం ఉదయం అసంతృప్త ఎమ్మెల్యే నాగరాజు నివాసానికి వెళ్లిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ మధ్యాహ్నం వరకు ఆయనతో మంతనాలు జరిపారు. మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ సభాపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటిలో నాగరాజుతో మంతనాలు సాగాయి.

ఈ చర్చల్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, కేపీసీసీ ఛీప్‌ దినేశ్ గుండురావుతో పాటు ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా సాయంత్రం పాల్గొన్నారు. ఎమ్మెల్యే పదవికి ఇచ్చిన రాజీనామాను వెనక్కితీసుకోవడం సహా కాంగ్రెస్‌లోనే కొనసాగేలా నాగరాజును ఒప్పించడంలో... కొంత వరకు సంకీర్ణకూటమి నేతలు విజయం సాధించారు.

"ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. విశ్వాసపరీక్ష నాటికి రాజీనామాలిచ్చిన ఎమ్‌ఎల్‌ఏలు అందరూ తిరిగి వస్తారన్న విశ్వాసం మాకుంది." - సిద్ధరామయ్య, కాంగ్రెస్ కర్ణాటక సభాపక్ష నేత

మరో ఐదుగురు తోడు...

ఇప్పటికే సుప్రీం గడప తొక్కిన 10 మంది ఎమ్మెల్యేలకు తోడుగా మరో ఐదుగురు శనివారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే రాజీనామల ఆమోదం అంశంపై 10 మంది ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌లో తమను కూడా చేర్లాలని వారు కోరారు. మంగళవారం వరకు ఎమ్మెల్యేల రాజీనామా లేఖలపై ఏవిధమైన నిర్ణయం వెల్లడించవద్దని సుప్రీం ఆదేశించింది.

ఓడిపోతామని తెలిసినా...

మరోవైపు బలపరీక్షకు సిద్ధమన్న సీఎం కుమారస్వామి ప్రకటనను వ్యూహాత్మక ఎత్తుగడగా పేర్కొన్నారు కర్ణాటక భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప. మరింత మంది ఎమ్మెల్యేలు జారిపోకుండా పన్నిన వ్యూహంగా అభివర్ణించారు. ఓడిపోతానని తెలిసే... కుమారస్వామి విశ్వాస పరీక్షకు సిద్ధం అయ్యారని యడ్యూరప్ప పేర్కొన్నారు.

బలాబలాలు...

సంకీర్ణ ప్రభుత్వాని సభలో ఇప్పటివరకూ స్వతంత్రులు ఇద్దరితో కలిపి మొత్తంగా సభలో 118 మంది సభ్యులున్నారు. అయితే వారిలో 16 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు. భాజపాకు సభలో 107 మంది సభ్యుల బలముంది. అసంతృప్తుల రాజీనామాలు స్పీకర్‌ ఆమోదిస్తే అధికార కూటమి బలం100కి పడిపోతుంది. కర్ణాటక విధానసభలో సాధారణ మెజారిటీ 113 సీట్లు.

London (UK), Jul 12 (ANI): New Zealand's skipper Kane Williamson gave a witty response to 'underdogs' tag given to the team ahead of final against England in World Cup final. "Breed of dog doesn't matter, anybody can beat anybody," said Williamson during press conference. New Zealand defeated India in a close match by 18 runs in semi-finals to qualify for final.
Last Updated : Jul 14, 2019, 5:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.