కొవిడ్-19 వ్యాక్సిన్పై సుంకం ఉంటుందా? ఉండదా అనే చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అదార్ పూనావాలా.. టీకా కొనుగోలు చేసి, దేశవ్యాప్తంగా సరఫరా చేయాలంటే సుమారు రూ.80 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఆ రకంగా చూస్తే ప్రభుత్వానికి అది భారీ వ్యయమే.
ఆ అవసరం లేదు..
ప్రభుత్వ వర్గాలు మాత్రం టీకా కోసం ప్రత్యేక సుంకం విధించే ప్రతిపాదన లేదని చెబుతున్నాయి. ప్రాథమిక దశలోటీకా కొనుగోలు చేసి.. ప్రజలకు సరఫరా చేసేందుకు అవసరమైన మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించనుందని అంటున్నాయి. అందుకు కావాల్సిన ఆర్థిక వనరులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, ప్రత్యేక సుంకం విధించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నాయి.
ధర తగ్గే అవకాశం..
సీరం ఇన్స్టిట్యూట్ లెక్కలను కూడా కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు అంగీకరించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు టీకా తయారీలో ఉన్నాయని, దానివల్ల టీకా ధర తగ్గే అవకాశముందని భావిస్తున్నాయి. టీకా సింగిల్ డోస్ సరిపోతుందా..? డబుల్ డోస్ అవసరమా..? అనేది ట్రయల్స్ పూర్తయన తర్వాతే ఒక అంచనాకు రాగలమని చెబుతున్నాయి. ప్రస్తుతానికైతే డోసు ధర సుమారు రూ.75 ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కచ్చితమైన ధర.. వచ్చే ఏడాది జులైకు ముందు మాత్రమే తెలియొచ్చని ఓ కేంద్ర ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా 73 లక్షలకు చేరిన కరోనా కేసులు