ETV Bharat / bharat

బ్రిడ్జ్​ మ్యాన్: పింఛన్​ డబ్బుతో నదిపై వంతెన - salandi river

14 ఏళ్ల క్రితం పనులు నిలిచిపోయిన ఓ వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించాడు ఓ విశ్రాంత ఉద్యోగి. అందు కోసం తన పింఛన్​, గ్రాట్యూటీ, పీఎఫ్​ డబ్బు సుమారు 12 లక్షలు వెచ్చించాడు. ప్రస్తుతం వంతెన పనులు పూర్తి కావస్తున్నాయి. ఆరు గ్రామాలను కలిపేందుకు కృషి చేసిన గంగాధర్​ రౌత్​ను అందరు బ్రిడ్జ్​ మ్యాన్​గా పిలుచుకుంటున్నారు.

బ్రిడ్జ్​ మ్యాన్: పింఛన్​ డబ్బుతో నదిపై వంతెన
author img

By

Published : Jun 6, 2019, 7:43 PM IST

బ్రిడ్జ్​ మ్యాన్: పింఛన్​ డబ్బుతో నదిపై వంతెన

పలు గ్రామాలను కలిపే వంతెన అసంపూర్తిగా ఉంటే ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోనక్కర్లేదు. వర్షాకాలంలో వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటిదే ఒడిశా కెందూఝర్​ జిల్లా కాన్పుర్​ గ్రామవాసులకు ఎదురైంది. సలాండి నదిపై 14 ఏళ్ల క్రితం ప్రారంభించిన వంతెన నేటికీ పూర్తికాలేదు.

కాన్పుర్​కు చెందిన 60 శాతం తోటలు, వ్యవసాయ భూములు సలాండి నదికి అవతలివైపు ఉన్నాయి. వ్యవసాయ భూములకు వెళ్లడానికి గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో నదిని దాటేందుకు వెదురు బొంగులతో చేసిన వంతెన, ఇతర మార్గాలను వినియోగించేవారు. రెండు దశాబ్దాలుగా వంతెన నిర్మించాలని డిమాండ్​ చేస్తున్నా పట్టించుకునే నాధుడు లేడు.

పింఛన్​ డబ్బుతో...

ప్రభుత్వ పనితీరుపై విసుగు చెందిన కాన్పుర్​ గ్రామవాసి గంగాధర్​ రూట్​ అనే విశ్రాంత ఉద్యోగి సలాండి నదిపై వంతెన నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే నిర్మాణం ప్రారంభించాడు. అందుకు తన పింఛన్​, గ్రాట్యూటీ, పీఎఫ్​ నగదు సుమారు 12 లక్షలు వినియోగించాడు. గతంలో కారు కొనుక్కోవాలని దాచుకున్న డబ్బునూ వంతెనకే వినియోగించాడు. ప్రస్తుతం వంతెన నిర్మాణం చివరి దశలో ఉంది. జిల్లాకు చెందిన 76 ఏళ్ల దైతారీ నాయక్​ అనే వ్యక్తి 3 కిలోమీటర్ల మేర కాలువ తవ్వటం చూసి ప్రేరణ పొందానని చెబుతున్నాడు.

ఈ వంతెన కాన్పూర్​, సోసో, దనేయ్​పుర్​, పధియారిపల్లి, నియూదాని, మైచపడ అనే గ్రామాలకు వారధిగా మారనుంది. సుమారు 10 వేల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది.

బ్రిడ్జ్​ మ్యాన్​గా...

ప్రస్తుతం 6 గ్రామాల ప్రజలు గంగాధర్​ను నిజమైన హీరోగా చెప్పుకుంటున్నారు. తమ ప్రాంతంలో రాజకీయ నాయకులు, అధికారుల భాగస్వామ్యం లేదని పేర్కొంటున్నారు. ఆయన ఉదార సహకారంతో రూట్​ను అందరు 'బ్రిడ్జ్​ మ్యాన్​'గా పిలుచుకుంటున్నారు.

ఇదీ చూడండి: కట్టెల పొయ్యి వాడని ఏకైక గ్రామం 'బాన్చా'

Intro:Body:

sd

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.