ETV Bharat / bharat

బంపర్ ఆఫర్: ఆ పాఠశాలలో చేరితే ఫోన్​ ఉచితం - tamilnadu school news

తమిళనాడులోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్​ పాఠశాల.. విద్యార్థులకు బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. తమ స్కూల్లో చేరితే ఉచితంగా మొబైల్​ ఫోన్లు అందిస్తామని చెప్పింది. తరగతులు ఆన్​లైన్​లో జరుగుతున్న నేపథ్యంలో టీచర్లంతా కలిసి ఈ సేవాకార్యక్రమానికి పూనుకున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.

Free Cell Phones to Students for online Education - Awesome Government Aided School!
ఆ పాఠశాలలో చేరితే విద్యార్థులకు మొబైల్​ ఫోన్​ ఉచితం
author img

By

Published : Aug 30, 2020, 12:44 PM IST

తమిళనాడు మదురైలోని తియాగరాజర్ పాఠశాల.. విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్​ పెట్టింది. తమ స్కూల్​లో చేరే 6వ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా ఫోన్లు ఇస్తామని తెలిపింది. ఆన్​లైన్ తరగతులకు హాజరయ్యేందుకు వీటిని అందించనున్నట్లు పేర్కొంది యాజమాన్యం.

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభించిన యాజమాన్యాలు.. విద్యార్థులకు వర్చువల్​గానే తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లకూ అంగీకారం తెలిపింది. ఫలితంగా కొత్త విద్యార్థుల కోసం మొబైల్ ఫోన్ల ఆఫర్​ పెట్టింది తియాగరాజర్​​ స్కూల్​. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు పాఠశాల కావడం విశేషం.

ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో విద్యార్థులకు మొబైల్ ఫోన్లు అందించ​నున్నట్లు తెలిపారు తియాగరాజర్​​ స్కూల్​ ప్రధానోపాధ్యాయులు రామనాథన్​. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే తమిళ భాషను ప్రోత్సహించేందుకు కూడా ఇది దోహదపడుతుందన్నారు.

"జూన్​ నుంచి వాట్సాప్​ ద్వారా విద్యార్థులకు ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం. చాలా మంది విద్యార్థులు హాజరుకాలేకపోతున్నారు. వారికి మొబైల్​ కొనే స్థోమత లేదని తెలిసింది. అందుకే ఉపాధ్యాయులందరం కలిసి 6వ తరగతిలో చేరే విద్యార్థులకు ఉచితంగా మొబైల్​ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దీని ద్వాారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు."

-రామనాథన్, ప్రాధానోపాధ్యాయుడు.

ఇప్పటికే ఈ పాఠశాలలో రూపాయి ఖర్చు లేకుండా విద్యను అందిస్తుండగా.. ఫోన్​ సేవతో విద్యార్థుల సంఖ్య ఇంకా పెరుగుతుందని స్కూల్​ యాజమాన్యం భావిస్తోంది.

ఇదీ చూడండి: అందాల అలప్పుజలో 'బోట్​హౌస్' సేద్యమూ ఆసరానే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.