ETV Bharat / bharat

భారత ప్రతీకార దాడుల్లో ఐదుగురు పాక్​ జవాన్లు హతం - భారత్​ పాక్​ యుద్ధం

జమ్ముకశ్మీర్​ నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ప్రతీకార దాడుల్లో ఐదుగురు పాక్​ సైనికులను మట్టుబెట్టింది భారత సైన్యం. ఈ ఘటనలో మరో ముగ్గురు పాక్​ జవాన్లు గాయపడ్డారు.

Five Pak soldiers killed in retaliatory firing by India along LoC in J&K
భారత్​ ప్రతీకార దాడుల్లో ఐదుగురు పాక్​ సైనికులు హతం
author img

By

Published : Dec 11, 2020, 10:05 AM IST

జమ్ముకశ్మీర్​లోని పూంచ్​ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి సైనిక బలగాలు నిర్వహించిన ప్రతీకార దాడుల్లో ఐదుగురు పాకిస్థాన్​ సైనికులు హతమయ్యారు. మరో ముగ్గురు గాయపడినట్టు రక్షణశాఖ ప్రకటించింది. ఈ ఘటనలో పాక్​ బంకర్లనూ ధ్వంసం చేసినట్టు పేర్కొంది.

పూంచ్​ జిల్లాలోని మాన్​కోట్​ సెక్టర్​లో భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని గురువారం కాల్పులకు తెగబడింది పాకిస్థాన్​. విచక్షణారహితంగా జరిపిన ఈ దాడుల్లో.. భారత పౌరులకు ఆస్తి నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో ఎదురుదాడికి దిగింది భారత సైన్యం. సుమారు 2 గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే ఐదుగురు పాక్​ సైనికులను మట్టుబెట్టింది భారత ఆర్మీ.

ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు 3,200 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్​. ఈ ఘటనల్లో మొత్తం 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు.

ఇదీ చదవండి: సాయుధ దళాలకు త్వరలోనే స్వదేశీ కార్బైన్​ తుపాకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.