మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను.. ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు క్షతగాత్రులయ్యారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు అధికారులు.
కత్ని జిల్లా నుంచి బయల్దేరిన వ్యాన్ నీముచ్కు వెళ్తుండగా.. నర్వార్ పోలీసు స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంపై ఉజ్జయిన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: బైక్ను ఢీ కొట్టి మహిళపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్