ETV Bharat / bharat

'ట్రాక్టర్ ర్యాలీ తర్వాతే తదుపరి కార్యాచరణ'

ట్రాక్టర్ ర్యాలీ ముగిసిన తర్వాతే తదుపరి కార్యాచరణపై దృష్టిసారిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. సాగు చట్టాల రద్దు విషయంలో వెనకడుగు లేదని స్పష్టం చేశారు. రెండు లక్షల ట్రాక్టర్లతో కిసాన్ పరేడ్​కు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

tractor rally
'ట్రాక్టర్ ర్యాలీ తర్వాతే తదుపరి కార్యచరణ'
author img

By

Published : Jan 24, 2021, 5:41 AM IST

Updated : Jan 24, 2021, 6:23 AM IST

జనవరి 26న నిర్వహించాల్సిన కిసాన్ పరేడ్​పైనే ప్రస్తుతం తాము దృష్టిసారించినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీ ముగిసిన తర్వాతే తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే సాగు చట్టాల రద్దు డిమాండ్ విషయంలో వెనకడుగు లేదని స్పష్టం చేశారు.

"ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి మా డిమాండ్​లో మార్పు లేదు. మూడు చట్టాలు పూర్తిగా రద్దు చేయాలి. అది కాకుండా వేరే పరిష్కారానికి మేం ఒప్పుకోం."

-గుర్నామ్ సింగ్ ఛాదునీ, హరియాణా భాతీయ కిసాన్ యూనియన్ చీఫ్

చివరిసారిగా జరిగిన చర్చల్లో సాగు చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. ఈ సమయంలో ఓ సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది. నిరసనకారులు వెనక్కి వెళ్లిపోవాలని సూచించింది. దీనిపై రైతు సంఘాల నేతలు శనివారం సుదీర్ఘంగా చర్చించినప్పటికీ.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ర్యాలీకి రెండు లక్షల ట్రాక్టర్లు

మరోవైపు రైతుల ట్రాక్టర్ ర్యాలీకి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం రెండు లక్షల ట్రాక్టర్లు కిసాన్ పరేడ్​లో పాల్గొంటాయని నేతలు తెలిపారు. పంజాబ్ నుంచి లక్షకు మించి ట్రాక్టర్లు వస్తాయని కీర్తి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నిర్భయ్ సింగ్ ధుడికే పేర్కొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ నుంచి 25 వేల ట్రాక్టర్లు రానున్నట్లు వెల్లడించారు. ర్యాలీని క్రమబద్ధీకరించేందుకు 2,500 మంది వలంటీర్లను నియమించామన్నారు.

ర్యాలీని పర్యవేక్షించడానికి సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్​పథ్​లో రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన తర్వాత రైతుల ర్యాలీ ప్రారంభం కానుంది.

Last Updated : Jan 24, 2021, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.