ETV Bharat / bharat

'ఈటీవీ భారత్'​ ఎఫెక్ట్​: హన్సీ ప్రహారికి ప్రభుత్వ ఉద్యోగం - హన్సీ ప్రహారి

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో రెండు డిగ్రీలు చదివి భిక్షమెత్తుకుంటున్న హన్సీ ప్రహారిపై 'ఈటీవీ భారత్' ప్రచురించిన కథనానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖ ఆర్య.. హన్సీని స్వయంగా కలిసి తమ శాఖలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ​

Hansi
హన్సీ ప్రహారి
author img

By

Published : Oct 21, 2020, 4:47 AM IST

Updated : Oct 21, 2020, 7:58 AM IST

"ఆంగ్లంలో రెండు డిగ్రీలు -ప్రస్తుతం యాచకురాలు"అంటూ 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది. హరిద్వార్​కు చెందిన హన్సీ ప్రహారికి సాయం అందించేందుకు ముందుకొచ్చింది.

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖ ఆర్య.. కొంత మంది కుమావూ విశ్వవిద్యాలయం అధికారులతో కలిసి నెహ్రూ యువ కేంద్రంలో హన్సీని కలిశారు. హన్సీతో మాట్లాడి ఆమె సమస్యలను తెలుసుకున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.

భారత్​కు కృతజ్ఞతలు..

ఈ సందర్భంగా హన్సీ దీనగాథను వెలుగులోకి తెచ్చిన ఈటీవీ భారత్​కు రేఖ ఆర్య కృతజ్ఞతలు తెలిపారు.

హన్సీ గురించి ఈటీవీ భారత్​లో ఆదివారం కథనం ప్రచురించగా వివిధ వర్గాల నుంచి భారీ స్పందన లభించింది. ఆమెకు సాయం చేసేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు సహా చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి.

ఇదీ చూడండి: హన్సీ ప్రహారికి అండగా కదిలిన ఉత్తరాఖండ్​ యంత్రాంగం

Last Updated : Oct 21, 2020, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.