ETV Bharat / bharat

'చైనాతో పోరాడాల్సిన వేళ ప్రతిపక్షాలపై దాడులు!' - money laundering case on Ahmed Patel

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దాదాపు 8 గంటలపాటు విచారించింది. సందేశరా సోదరుల మనీలాండరింగ్ కేసుతో ఉన్న సంబంధాలపై ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అయితే ఇది ప్రతిపక్ష నేతలపై మోదీ సర్కార్ చేయిస్తున్న దాడి అని అహ్మద్ పటేల్ విమర్శించారు. చైనాతో పోరాడాల్సిన ప్రభుత్వం.. ప్రతిపక్షాలతో పోరాడుతోందని పేర్కొన్నారు.

ED questions Ahmed Patel at his house for 8-hrs in money laundering case
మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్​ను ప్రశ్నించిన ఈడీ
author img

By

Published : Jun 28, 2020, 4:07 AM IST

సందేశరా సోదరుల మనీలాండరింగ్ కేసుతో ఉన్న సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్​ పటేల్​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు 8 గంటలపాటు విచారించింది. దిల్లీలోని అహ్మద్ పటేల్ నివాసానికి వెళ్లిన ముగ్గురు సభ్యుల ఈడీ బృందం... ఈ కేసు విషయంలో అహ్మద్ పటేల్ వాగ్మూలం నమోదు చేసింది. తదుపరి విచారణ జూన్​ 30న జరుగుతుందని స్పష్టం చేసింది.

తప్పుదోవ పట్టించడానికే..

ఈడీ అధికారులు వెళ్లిపోయిన తరువాత అహ్మద్ పటేల్ విలేకరులతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

"మోదీ సర్కార్​ సంక్షోభంలో చిక్కుకున్న ప్రతిసారీ లేదా ఎన్నికల సమయంలో ఇలా దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నేతలపైకి ఉసిగొల్పుతుంది. మీరు బాగా విశ్లేషించి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రతిసారీ రాజ్యసభ, లోక్​సభ, విధానసభ ఎన్నికలు జరిగినప్పుడు లేదా మోదీ ప్రభుత్వం ఏదైనా సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు... ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దర్యాప్తు సంస్థలు ఒక్కసారిగా చురుగ్గా మారిపోతుంటాయి."

"దురదృష్టం ఏమిటంటే, దేశ భద్రత (ఇండో చైనా సరిహద్దు సమస్య), కరోనా సంక్షోభం, ఆర్థిక సమస్యలతో పోరాడవలసిన మోదీ ప్రభుత్వం... ప్రతిపక్షాలతో పోరాడుతోంది. అయితే చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అందువల్ల తప్పు చేయనివారు ఎవరైనా భయపడాల్సిన పనిలేదు. మనస్సాక్షిగా చెబుతున్నా.. ఇందులో నేను దాచడానికి ఏమీ లేదు."

- అహ్మద్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నేత

అహ్మద్​ పటేల్ ఇంతకు ముందు యూపీఏ ఛైర్​పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆ పార్టీలోని అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా పేరు గడించారు.

భారీ కుంభకోణం

వడోదరా కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా సంస్థ స్టెర్లింగ్ బయోటెక్.. వివిధ బ్యాంకుల నుంచి రూ.14,500 కోట్ల మేర రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదు. ఈ వ్యవహారంలో అక్రమ నగదు చలామణి కోణంపై దర్యాప్తు చేపట్టిన ఈడీ ... సంస్థ ప్రమోటర్లు, సందేశరా సోదరులైన నితిన్, చేతన్, దీప్తిలకు ఇందులో పాత్ర ఉన్నట్లు గుర్తించింది. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారు. అయితే వారు నైజీరియాలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు చేసిన నేరం.. వజ్రాల వ్యాపారులు నీరవ్​ మోదీ, మెహుల్ చోక్సీల పంజాబ్​ నేషనల్ బ్యాంకు కుంభకోణం (రూ.13,400 కోట్లు) కంటే చాలా పెద్దదని ఈడీ చెబుతోంది.

ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి స్టెర్లింగ్ బయోటెక్ తీసుకున్న రూ.5,383 కోట్ల రుణాలు... నిరర్ధక ఆస్తులుగా మారినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

క్రిమినల్ కేసు

సందేశరా సోదరులపై సీబీఐ దర్యాప్తుతో పాటు పన్ను ఎగవేత కేసులు కూడా ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు ఆధారంగా క్రిమినల్​ కేసు నమోదు చేసిన ఈడీ... ఈ కుంభకోణంలో అహ్మద్​ పటేల్ సహా పలువురు రాజకీయనేతలకు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తోంది. గతేడాది అహ్మద్​ పటేల్ కుమారుడు ఫైజల్, అల్లుడు ఇర్ఫాన్​ అహ్మద్ సిద్ధిఖీల వాంగ్మూలం నమోదు చేసిన ఈడీ.. తాజాగా ఆయన​ వాంగ్మూలం కూడా తీసుకుంది.

ఫ్రోజెన్ అసెట్స్​

ఈ మనీ లాండరింగ్ కేసులో ఈడీ... స్టెర్లింగ్ బయోటెక్​కు చెందిన దేశ, విదేశాల్లోని రూ.14,000 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసింది. వీటిలో నైజీరియాలోని ఆయిల్ రిగ్​లు, పనామాలోని ఓడలు కూడా ఉన్నాయి.

ఇదీ చూడండి: భవిష్యత్​ తరాల మార్గదర్శి- సంస్కరణల రుషి 'పీవీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.