ETV Bharat / bharat

ఆ ఏఎస్​ఐ మృతికి కరోనానే కారణం

దేశ రాజధాని దిల్లీ పోలీసు విభాగంలో మరొకరు కరోనాకు బలయ్యారు. నేర విభాగంలోని ఫింగర్​ ప్రింట్​ బ్యూరోతో కలిసి పని చేసిన ఏఎస్​ఐ ఒకరు మహమ్మారి బారిన పడి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

author img

By

Published : May 31, 2020, 1:18 PM IST

Delhi Police SI dies due to COVID-19
కరోనాతో మరో దిల్లీ పోలీసు మృతి!

కరోనా కారణంగా దేశ రాజధాని దిల్లీలో 53 ఏళ్ల అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్(ఏఎస్​ఐ)​ ఒకరు మరణించారు. వైరస్​తో పోలీసు సిబ్బందిలో ఇప్పటివరకు ఇద్దరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

దిల్లీలోని కమలా మార్కెట్​ ప్రాంతంలో నేర విభాగానికి చెందిన ఫింగర్​ ప్రింట్​ బ్యూరో(ఎప్​పీబీ)తో కలిసి ఏఎస్​ఐ విధులు నిర్వహించినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్​ రేవా జిల్లాకు చెందిన ఆయన.. 2014 నవంబరు 1న దిల్లీ పోలీసు విభాగంలో చేరినట్లు తెలిపారు.

చనిపోయిన ఏఎస్​ఐ మే 26న జ్వరం, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుండటం వల్ల.. లేడీ హార్డింగ్​ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. మే 28న పాజిటివ్​ నిర్ధరణ అయ్యిందన్నారు. వెంటనే దిల్లీ కాంట్​లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా.. శనివారం సాయమంత్రం మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.

అంతకుముందు వాయవ్య దిల్లీలోని భరత్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లో 31 ఏళ్ల కానిస్టేబుల్​ కరోనాకు బలయ్యారు.

ఇదీ చూడండి:కరోనా భయపెడ్తున్నా.. కలవరపడని ఖాకీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.