ETV Bharat / bharat

డాషింగ్​ దర్జీ... ద సోషల్​ మీడియా హీరో

సోషల్​ మీడియా పుణ్యమా అని మరో సామాన్యుడు సెలబ్రిటీ అయ్యాడు. దిల్లీ వాసి ఓంకార్ జైట్లీ సరదాగా తీసుకున్న ఓ ఫొటో తన మిత్రుని ద్వారా సామాజిక మాధ్యమాలకు చేరింది. దానితో కొందరు యువతులు​ డూయెట్​ వీడియోలు చేసి టిక్​టాక్​లో పెట్టారు. సోషల్​ మీడియాలో అతనికి యమా క్రేజ్ వచ్చింది. పలు చిత్రాల్లో నటించేందుకు, మోడలింగ్ చేసేందుకు ఆఫర్లు వెల్లువెత్తాయి.

author img

By

Published : Jul 15, 2019, 11:58 AM IST

సామాజిక మాధ్యమాల మాయ.. సెలెబ్రిటీగా సామాన్యుడు​!
డాషింగ్​ దర్జీ... ద సోషల్​ మీడియా హీరో

దిల్లీకి చెందిన ఓంకార్​ జైట్లీ సామాజిక మాధ్యమాల వల్ల ఇప్పుడు 'డాషింగ్​ దర్జీ'గా సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు. కొన్ని రోజుల క్రితం కోచింగ్​ సెంటర్​ యజమాని అయిన తాను ఇప్పుడో తార. సోషల్​ మీడియాలో తనకే తెలియకుండా మిత్రుడు పోస్ట్​ చేసిన ఒక్క ఫొటోతో హీరోగా మారిపోయాడు.
ఓంకార్​ జూన్​ 25న తన స్నేహితుడిని కలవడానికి దర్జీ దుకాణానికి వెళ్లాడు. స్నేహితుడి దుకాణమే కాబట్టి సరదాగా టేప్​ మెడలో వేసుకున్నాడు. పక్కనే ఖాకీ దుస్తులు వేలాడుతున్నాయి. మరో స్నేహితుడు తనను ఆటపట్టించేందుకు ఓ ఫొటో తీసి ఇన్​స్టాగ్రామ్​లో పెట్టాడు. అంతే.. మూడు రోజుల్లో లక్షకు పైగా లైకులు.. వేలల్లో షేర్లు. కొన్ని రోజుల్లోనే అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్​ అయింది.

"ఇదొక ఊహించని ప్రయాణం .. నేనెప్పుడూ ఆలోచించలేదు ఇలా అవ్వాలని. తక్కువ సమయంలోనే నాకు ఎన్నో మోడలింగ్​ ఆఫర్స్​ వచ్చాయి. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. మొదట్లో కొంత భయంగా అనిపించింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. వార్తా మాధ్యమాలు నా ఇంటర్​వ్యూ కోసం రావడం వింతగా అనిపించింది."
-ఓంకార్​ జైట్లీ, సోషల్​ మీడియా సెలబ్రిటీ

అంత క్రేజ్​ ఎందుకు?

ఆకట్టుకునే రూపం ఉన్న కుర్రాడు దర్జీ తరహాలో టేప్​ మెడలో వేసుకుని ఫోటోకు పోజ్ ఇవ్వగా... డాషింగ్​ దర్జీ అని అభిమానులు పేరు పెట్టుకున్నారు. ఆయన ఫొటోకు అమ్మాయిలు టిక్​టాక్​లో డూయెట్​లు చేసి పెట్టారు. ఇంకేముంది.. ఓంకార్ క్రేజ్​ మామూలుగా పెరగలేదు.

"ఇంతకుముందు స్వేచ్ఛగా తిరిగేవాడిని. ఈ ఫొటో వైరల్​ అయ్యాక బయటికెళ్లాలంటే భయంగా ఉంది. ఓ షాపింగ్​ మాల్​కు వెళ్లాను. అక్కడ నాకే తెలియకుండా డాషింగ్​ దర్జీ మన మాల్​కు వచ్చారని మైక్​లో ప్రకటించారు. ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు."

జనాలు ఇంతగా ఇష్టపడుతున్న తర్వాత సినిమాల్లో అవకాశాలు రాకుండా ఉంటాయా? బాలీవుడ్​ చిత్రాల్లో హీరోగా చేసేందుకు, వ్యాపార ప్రమోషన్స్​​ చేసేందుకు, మోడల్​గా చేసేందుకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఓంకార్​ షెడ్యూల్​ ఎంతో బిజీగా మారిపోయింది.

"కొన్ని సార్లు సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిణామాలను ఆస్వాదిస్తున్నాను. నా అభిమానులను ఇబ్బంది పెట్టను. నేనిప్పుడో సెలబ్రిటీని అయ్యాను. నేనెంత ఎత్తుకు ఎదిగినా సామాన్యుడిలానే బతుకుతాను."
-ఓంకార్​ జైట్లీ, సోషల్​ మీడియా సెలబ్రిటీ.

సోషల్​ మీడియాలో లైక్స్​ కోసం కొందరు నానా తంటాలు పడుతుంటే.. అదృష్టం మాత్రం కొందరిని రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేసేస్తుంది. తమలో దాగి ఉన్న ప్రతిభ ఒక్కో సారి అనుకోకుండా ఇలా బయటపడుతూ ఉంటుంది.

ఇదీ చూడండి:'ప్లీజ్​... నన్ను పురుషుడిగా గుర్తించండి!'

Intro:Body:

y

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.