స్వైన్ ఫ్లూ సోకిందనే అనుమానంతో ఓ మహిళ మధ్యప్రదేశ్ జబల్పుర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆసుపత్రిలో చేరింది. ఆమెను స్వైన్ ఫ్లూ వార్డు నుంచి ఐసీయూకు తరలిస్తుండగా... ఓ జూనియర్ డాక్టర్ సదరు మహిళ చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం సిద్ధం చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు తెలియజేశారు.
ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం జూనియర్ డాక్టర్ సహా మరో డాక్టర్ను సస్పెండ్ చేశారు అధికారులు.
చనిపోయిన మరో రోగి పత్రాలను జూనియర్ డాక్టరు తప్పుగా అర్థంచేసుకున్నందు వల్లే ఇలా జరిగిందని సీనియర్ వైద్యులొకరు తెలిపారు. అతనికి హిందీ రాదని.. పత్రాలపై హిందీలో వివరాలున్నట్లు చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు డాక్టర్లపై చర్యలు తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు.
ఇదీ చూడండి: పద్దు-19: కోట్లాది ప్రజల ఆకాంక్షల నడుమ నేడే బడ్జెట్