ETV Bharat / bharat

ఈశాన్య మహారాష్ట్ర వైపుగా 'నిసర్గ': ఐఎండీ

author img

By

Published : Jun 3, 2020, 8:39 PM IST

ముంబయి సహా పలు ప్రాంతాలను అతలాకుతలం చేసిన నిసర్గ తుపాను.. ఈశాన్య మహారాష్ట్ర వైపుగా కదులుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నాశిక్​, ధులే, నందుర్బార్​ జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని తెలిపింది.

Cyclone 'Nisarga'
ఈశాన్య మహారాష్ట్ర వైపుగా 'నిసర్గ': ఐఎండీ

నిసర్గ తుపాను ప్రస్తుతం ఈశాన్య మహారాష్ట్ర వైపుగా కదులుతున్నట్లు ప్రకటించింది భారత వాతావరణ శాఖ. నాశిక్​, ధులే, నందుర్బార్​ జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని, పెనుగాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాయ్​గఢ్​ జిల్లాలోని అలీగడ్​లో తీరం తాకిన నిసర్గ.. సాయంత్రం 4 గంటలకు తీరం దాటింది. రాయ్​గఢ్​, పాల్ఘర్​, ఠాణె, ముంబయి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

"ముందుగా అనుకున్నట్లుగానే.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం తుపాను ఈశాన్య మహారాష్ట్ర వైపుగా కదులుతోంది. ఉత్తర మహారాష్ట్రలోని నాశిక్​, ధులే, నందుర్బార్​ జిల్లాలు ప్రభావితమవుతాయి. వాయవ్య పుణెలోని ప్రాంతాలపైనా ఈ ప్రభావం ఉంటుంది. పుణె నగరం, జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయి. కొండ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు."

- అనుపమ్​ కశ్యాపి, వాతావరణ విభాగం, పుణె

ఎక్కడికక్కడ నీరు నిలవటం, కొండచరియలు విరిగిపడటం, వృక్షాలు నేలకూలటం వంటి ఘటనలు జరగొచ్చని చెప్పారు అనుపమ్​. పుణె జిల్లాలో రాత్రి 8.30 గంటల వరకు దీని ప్రభావం ఉంటుందని, రాత్రి 11.30 గంటలకు పూర్తిగా సద్దుమణుగుతుందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.