బంగాల్లో అంపన్ తుపాను బీభత్సం సృష్టించింది. రాజధాని కోల్కతా సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ప్రకృతి విపత్తు ధాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల సంఖ్య, ఆస్తి నష్టంపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని అధికారులు తెలిపారు.
-
#WATCH West Bengal: Rooftop of a school in Howrah was blown away by strong winds earlier today. #CycloneAmphan pic.twitter.com/nJY0KhAC3Z
— ANI (@ANI) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH West Bengal: Rooftop of a school in Howrah was blown away by strong winds earlier today. #CycloneAmphan pic.twitter.com/nJY0KhAC3Z
— ANI (@ANI) May 20, 2020#WATCH West Bengal: Rooftop of a school in Howrah was blown away by strong winds earlier today. #CycloneAmphan pic.twitter.com/nJY0KhAC3Z
— ANI (@ANI) May 20, 2020
మంగళవారం సాయంత్రం బంగాల్లోని దిఘా వద్ద అంపన్ తుపాను తీరం దాటింది. అనంతరం బంగాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గంటకు 19 కి.మీల వేగంతో గాలులు వీచాయి.
'కరోనా కన్నా దారుణం...'
విపత్తు నేపథ్యంలో పరిస్థితులను బంగాల్ ముఖ్యంత్రి మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు సమీక్షించారు. తుపాను ప్రభావం కరోనా వైరస్ కన్నా దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.
కూలిన చెట్లు.. విరిగి స్తంభాలు...
రాజధాని కోల్కతా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ పరగణాల జిల్లాల్లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి. విద్యుత్ తీగలు తెగిపోయాయి. అనేక ఇళ్లు అంధకారంలో ఉన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వల్ల పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. తుపాను ధాటికి సమాచార వ్యవస్థ దెబ్బతింది.

