మహమ్మారి కరోనా లక్షలాది మందిని పొట్టన పెట్టుకొని... ఎన్నో కుటుంబాలకు ఆనందాన్ని దూరం చేసింది. రాజస్థాన్ జోధ్‌పుర్‌కు చెందిన వ్యాస్ కుటుంబానికీ అటువంటి విషాదాన్నే మిగిల్చింది. ఒకే తరానికి చెందిన ముగ్గురు సోదరులను బలిగొంది. నెల రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరు వరుసగా కొవిడ్‌తో మృతి చెందారు. దీంతో అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో కూరుకుపోయింది.
28రోజుల్లో ఒక తరం..
వ్యాస్ కుటుంబంలో మొదటగా... పెద్దన్న 65 ఏళ్ల శ్యామ్ వ్యాస్ కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ.. సెప్టెంబర్ 7న లోకాన్ని విడిచారు. దీంతో కుటుంబ సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కొంతమందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వారిలో శ్యామ్ తమ్ముడు 58ఏళ్ల అశోక్ వ్యాస్ కూడా ఉన్నారు. అశోక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో తక్షణమే ఎయిమ్స్‌లో చేరారు. వారం రోజులపాటు చికిత్స పొంది.. కరోనాతో పోరాడి సెప్టెంబర్ 20 ప్రాణాలు విడిచారు అశోక్.
ఆగిపోలేదు
ఆ కుటుంబంపై కరోనా దాడి అక్కడితో ఆగిపోలేదు. శ్యామ్ రెండో తమ్ముడు సంజయ్ వ్యాస్... అక్టోబర్ 5న మహమ్మారితో పోరాడి, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు.
ఆ కుటుంబంలో మరో ఆరుగురు ప్రస్తుతం కొవిడ్‌తో యుద్ధం చేస్తున్నారు.
ఇదీ చూడండి: నక్సలైట్ల మధ్య అంతర్యుద్ధం- ఆరుగురు మృతి