1076 కొత్త కేసులు...
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1076 మందికి కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
బంగాల్లో గత 24 గంటల్లో 12 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 132కు చేరినట్లు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రకటించారు. ఇప్పటివరకు బంగాల్లో ఏడుగురు మరణించారు.
హిమాచల్ ప్రదేశ్లో 33 కరోనా కేసులుండగా.. 12 మంది కోలుకున్నారు. మరొకరు మరణించారు. ప్రస్తుతం రాాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16గా ఉంది.
త్రిపురలో తొలి కరోనా బాధితుడిని డిశ్చార్జి చేశారు. వరుసగా 3 పరీక్షల్లో కరోనా నెగిటివ్గా వచ్చిన కారణంగా ఆయనను పంపించేేశారు.
రాజస్థాన్లో ఇవాళ 41 కరోనా కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య 1046కు చేరింది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
హరియాణాలో మరో ఆరుగురు వైరస్ బారినపడ్డారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 190కి చేరింది. ఇక్కడ ఇద్దరు మృతిచెందారు.
గుజరాత్లో మరో 56 కేసులతో బాధితుల సంఖ్య 695కు చేరింది. మృతుల సంఖ్య 30గా ఉంది.
అసోంలో ఇప్పటివరకు 32 మందికి కరోనా సోకింది. ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.